Home » ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో మనిషి మనుగడకే ముప్పు.!?

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో మనిషి మనుగడకే ముప్పు.!?

by Mudra369 Editorial Desk
0 comments
Artificial Intelligence

Artificial Intelligence Danger Bells.. ప్రపంచంలో ఎక్కడ ఎవర్ని కదిలించినా, ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ గురించిన చర్చే జరుగుతోంది.

మన భారత దేశంలో.. అందునా, మన తెలుగు రాష్ట్రాల్లో అయితే, ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ గురించి ఓ రేంజ్‌లో జనం చర్చించుకుంటున్నారు.

ఎల్కేజీ నుంచే ఏఐ టూల్స్ వినియోగిస్తున్నారు మన దేశంలో చాలామంది పిల్లలు.. ప్రత్యక్షంగానో పరోక్షంగానో.! ‘మా చిన్నోడు భలే డిజైన్ చేశాడు’ అని చెప్పుకుని మురిసిపోవడం సర్వసాధారణమైపోయింది.

అంతలా ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఏఐ టూల్స్‌లో మళ్ళీ బోల్డన్ని రకాలున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఎన్నో కార్పొరేట్ సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి.

కోట్లు.. వందల కోట్లు కుమ్మరించి మరీ సరికొత్త ఏఐ టూల్స్‌ని తయారుచేస్తున్నారు.. వాటిని మార్కెటింగ్ చేస్తున్నారు. అదీ ఇదీ అని కాదు, అన్నిట్లోనూ ఈ ఏఐ టూల్స్ వినియోగం పెరిగిపోయింది.

Artificial Intelligence Danger Bells.. ఆర్టిఫీషియల్ సూపర్ ఇంటెలిజెన్స్..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సరే.. ఇది సూపర్ ఇంటెలిజెన్స్‌గా మారితేనో.! అంటే, తనంతట తానుగా ఆలోచించగలిగితేనో.! అప్పడిక, మానవాళి మనుగడకే ముప్పుగా పరిణమిస్తుందా.?

ఆంథ్రోపిక్ అనే ఓ సంస్థలో పనిచేసిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సైంటిస్ట్, రానున్న కొన్నేళ్ళలో ఏఐ టూల్స్ వినియోగం కారణంగా, ప్రపంచ వ్యాప్తంగా పది శాతం మంది మనుషులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం వుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతున్నాయి షరామామూలుగానే. కానీ, ఇది నవ్వులాట కాదు.. అత్యంత సున్నితమైన అంశం. అత్యంత గంభీరమైన అంశం కూడా.

ఏదైనా సరే, మన చేతుల్లో లేని స్థాయికి అదుపు తప్పితే.. మనిషి మనుగడకి ప్రమాదమే. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కీ ఇదే వర్తిస్తుంది.

మనిషి మనుగడకి భద్రత ఎలా.?

భద్రతా కోణంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని అత్యంత జాగ్రత్తగా వాడాలనీ, దాన్నీ కొంతమేర నియంత్రించాలనీ.. ప్రపంచ వ్యాప్తంగా నిపుణుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవాన్ హుబింగర్ అనే ఆంథ్రోపిక్ సైంటిస్ట్ వ్యక్తం చేసిన పై అభిప్రాయంతో, ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోందిప్పుడు.

ఆల్రెడీ, ఏఐ టూల్స్ వినియోగం కారణంగా వివిధ రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోయాయి. నిరుద్యోగం ముందు ముందు మరింత పెరిగిపోయే అవకాశాలున్నాయి.

Also Read: సెల్ఫీ ప్రేమ.! అందాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతుందా.?

హెచ్చరికలు.. భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదకర పరిస్థితుల సంగతి పక్కన పెడితే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మీద మోజు ఇప్పట్లో తగ్గేలా లేదు.

మొబైల్ ఫోన్ రేడియేషన్ గురించి బోల్డన్ని వివాదాలు తెరపైకొచ్చాయ్.. కానీ, ఆ రేడియేషన్‌తోనే మనం సహజీవనం చేస్తున్నామిప్పుడు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదకరమే అయినా, దాంతోనూ సహజీవనం చేయక తప్పదేమో.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group