Home » ‘సర్దార్-2’ రివ్యూ: ప్రేక్షకుల సహనానికి అగ్ని పరీక్ష.!

‘సర్దార్-2’ రివ్యూ: ప్రేక్షకుల సహనానికి అగ్ని పరీక్ష.!

by Mudra369 Editorial Desk
0 comments
Sardar 2 Review

Karthi Sardar 2 Review.. కార్తీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనేముంది.? ‘ఊపిరి’ సినిమాతో, నిఖార్సయిన తెలుగు హీరో అయిపోయాడు కార్తీ.!

అన్నయ్య సూర్య కంటే, తెలుగులో తమ్ముడు కార్తీకి ఎక్కువమంది అభిమానులున్నారనడం అతిశయోక్తి కాదేమో. అప్పుడప్పుడూ ‘ఖైదీ’ లాంటి మంచి సినిమాలొస్తాయ్ కార్తీ నుంచి.

అదే సమయంలో, డిజాస్టర్లు కూడా కార్తీ నుంచి వస్తాయ్. తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయిన సినిమాలే అయినా, తెలుగు హీరో కార్తీ.. అనేంతలా అభిమానులు ఎదురుచూస్తుంటారు అతని సినిమాల కోసం.

కార్తీ నటించిన ‘సర్దార్’ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ‘స్పై’ నేపథ్యంలో తీసిన సినిమా అది. దానికి కొనసాగింపే ‘సర్దార్-2’.

బోల్డంతమంది నటీ నటులు ఈ సినిమా ప్రమోషన్స్‌లో కనిపించారు. కార్తీ, ఎస్ జే సూర్య, మాళవిక మోహనన్, ఆషిక రంగనాథ్.. ఈ సినిమాని తెలుగునాట కూడా గట్టిగానే ప్రమోట్ చేశారు.

Karthi Sardar 2 Review.. ‘సర్దార్ 2’ కథా కమామిషు..

ఇంతకీ, ఈ ‘సర్దార్-2’ కథా కమామిషు ఏంటి.? ‘రా’ ఏజెంట్ విజయ్ ప్రకాష్, మరో ఏజెంట్ వాల్రస్‌ని కలుస్తాడు. వాల్రస్ ఓ మెటల్ ‘కీ’ని ఇస్తాడు విజయ్ ప్రకాష్‌కి.

ఆ ‘కీ’ సంగతి తేల్చే క్రమంలో ‘ఆపరేషన్ డోకు’ గురించి తెలుస్తుంది విజయ్ ప్రకాష్ బృందానికి. మరోపక్క బయో వెపన్‌కి సంబంధించిన ముప్పు మళ్ళీ ఏర్పడుతుంది.

అదే సమయంలో సర్దార్ చనిపోలేదని విజయ్ ప్రకాష్‌కి తెలుస్తుంది. సర్దార్ ఎవరో కాదు, విజయ్ ప్రకాష్ తండ్రి. ఏజెంట్ సర్దార్‌తో కలిసి విజయ్ ప్రకాష్, బయో వెపన్ ముప్పుని ఎలా ఎదుర్కొన్నాడన్నదే మిగతా కథ.

కథగా చెప్పుకోవడానికే ఇంత గందరగోళంగా వుంటే, తెరపై చెప్పే క్రమంలో దర్శకుడు ఇంకెంత తడబడి వుంటాడో అర్థం చేసుకోవచ్చు.

భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులకి అడుగడుగునా నిరాశే ఎదురవుతుంటుంది. ఏ పాత్ర ఎందుకెలా బిహేవ్ చేస్తుందో అర్థం చేసుకోవడం ప్రేక్షకుడికి కత్తి మీద సాము లాంటిదే.

సీన్స్ అలా నడుస్తూ వుంటాయ్.. ప్రేక్షకుడిలో అయోమయం పెరిగిపోతుంది. సహనమూ కోల్పోతాడు. దానికి తోడు, సినిమా నిడివి చాలా ఎక్కువ. దాంతో, ప్రేక్షకుడు సహనం కోల్పోయే పరిస్థితి వస్తుంది.

మ్యూజిక్ ఫర్వాలేదనిపిస్తుంది. నిజానికి, ఇలాంటి సినిమాలకి మ్యూజిక్.. అందునా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. సినిమాటోగ్రఫీ బాగానే వుంది.

నటుడిగా కార్తీకి వంక పెట్టలేం. ఎస్ జే సూర్య లౌడ్ యాక్టింగ్ అన్నిసార్లూ సత్ఫలితాలనివ్వదు. చిరాకు తెప్పిస్తుంది ఈ సినిమాలో.

మాళవిక మోహనన్ జస్ట్ ఓకే. ఆషిక రంగనాథ్‌కి అంత సీన్ లేదు. వున్న ఆ కొన్ని కామెడీ సీన్స్ మరింత చిరాకు పుట్టిస్తాయి.

సినిమాలో బాగున్న సన్నివేశాలేంటి.? అని బూతద్దం పెట్టుకుని వెతకాలేమో. వెతికినా దొరకవ్. నెగెటివ్ పాయింట్స్ అంటే, అన్నిటినీ మెన్షన్ చేసెయ్యొచ్చు నిస్సందేహంగా.

స్టార్ కాస్టింగ్ వృధా అయ్యింది.. భారీగా చేసిన ఖర్చూ వృధా అయ్యింది. సభ్య సమాజానికి ఏదో సందేశం ఇచ్చేద్దామని క్లాసులు పీకే ప్రయత్నం దర్శకుడు చేశాడుగానీ, అదీ సిల్లీగా అనిపిస్తుంది.

అన్ని వనరులూ వున్నప్పుడు దర్శకుడు ఇంత నిర్లక్ష్యంగా ‘సర్దార్-2’ సినిమాని ఎలా తీశాడో ఏమో.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group