EPIC A Censored Movie.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘ఎపిక్’. సినిమా ప్రమోషన్లు గట్టిగా చేశారు. చాలా చాలా గట్టిగా చేశారు.
ఓ ప్రమోషనల్ ఈవెంట్‌కి ఆనంద్ దేవరకొండ వదిన, సినీ నటి రష్మిక మండన్న హాజరైంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఆనంద్ అన్నయ్య విజయ్ దేవరకొండ హాజరవడంలో వింతేముంది.?
సరే, సినిమా అన్నాక.. దాన్ని ఎలాగోలా ప్రమోట్ చేసుకోవాలి కదా.! కానీ, ప్రమోషన్లు కాలేజీల్లో ఎందుకు చేసినట్లు.? ఏం, ఎందుకు చెయ్యకూడదు.?
సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్.! ఇందులో హింస, రక్తపాతం గురించి కాదు.. ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. ‘వల్గర్ కంటెంట్’కి.!
ఎంత వల్గర్ కంటెంట్ వుందో, ట్రైలర్లోనే కనిపించింది. నటీనటులిద్దరూ చెలరేగిపోయారు. వల్గారిటీని మాటల్లో వేరే స్థాయికి తీసుకెళ్ళిపోయారు ఇద్దరూ.
సినిమాలో బోల్డ్ సీన్స్ ఎన్ని వున్నాయో ఏమోగానీ, సెన్సార్ బోర్డ్ నిర్మొహమాటంగా ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చి పారేసింది.
అయితే, థియేటర్లలో ‘18’ ఏళ్ళ లోపు పిల్లలపై నిషేధం ఖచ్చితంగా అమలు చేస్తారా.? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.
వాస్తవానికి, సినిమాలో కంటెంట్ ఏంటో నటీనటులు, దర్శక నిర్మాతలకు తెలుసు. అలాంటప్పుడు, ఈ సినిమాని కాలేజీల్లో ఎలా ప్రమోట్ చేశారు.? కాస్తంతైనా ఇంగితం వుండాలి కదా.?
‘ఎపిక్’ సినిమాని కాలేజీల్లో ప్రమోట్ చేసింది, యూత్ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేయడానికి. మొన్నామధ్య ‘టాక్సిక్’ విషయమై ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.!
కాలేజీల్ని.. అందునా, ఇంజినీరింగ్ కాలేజీల్ని ఈ మధ్య సినిమా ప్రమోషన్లకి గట్టిగా వాడేస్తున్నారు. తప్పేం లేదు. కానీ, ఇలాంటి సినిమాల విషయంలో.. ఒకింత బాథ్యగా వ్యవహరించాలి.
