Thank You Movie Nagachaitanya.. సినిమా టిక్కెట్ల రేట్ల విషయమై తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర గందరగోళం నెలకొంది.
తమిళ, కన్నడ, హిందీ సినిమాలకు ఆయా రాష్ట్రాల్లో లేని తలనొప్పి, తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాలకు ఎందుకు ఎదురవుతున్నట్లు.?
కొన్ని రాజకీయ శక్తులు చెబుతున్నట్లు, సినిమా టిక్కెట్ల రేట్లు సామాన్యుడికి అందుబాటులో వుంచేసేలా సమోసా ధర కంటే తక్కువ ధరకు టిక్కెట్లు అమ్మడమూ సబబు కాదు.!
ఇంకొందరు సినీ జనాలు చెబుతున్నట్లు, ఎంత ఖర్చు పెట్టి అయినా ప్రేక్షకుడు సినిమాకి వస్తాడనే కోణంలో, టిక్కెట్ ధరని ఐదొందల వరకూ పెంచేయడమూ సరికాదు.!
Thank You Movie Nagachaitanya.. థ్యాంక్యూ సినిమా కూడా తగ్గించిందిగానీ.!
అక్కినేని నాగచైతన్య, రాశి ఖన్నా జంటగా తెరకెక్కిన ‘థాంక్యూ’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సింగిల్ స్క్రీన్స్‌లో 100 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 150 రూపాయలు (జీఎస్టీ కాకుండా) టిక్కెట్ల ధరల్ని నిర్ణయించారట.

ఇలా తయారైంది సినిమా పరిస్థతి. ‘మా సినిమాకి టిక్కెట్ల ధరలు పెంచడంలేదు..’ అని చెప్పుకోవాల్సిన దుస్థితి అసలెందుకు వచ్చింది.?
సినిమా అంటే వినోదం.! ఆ వినోదం నచ్చితే, ప్రేక్షకుడు ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడు. నచ్చకపోతే.. ఊరికినే వచ్చినా ఆ వినోదం వైపు చూడడు. ఇది వినోదానికి సంబంధించి అసలు సిసలు వాస్తవం.
నెగెటివిటీ తగ్గితే తప్ప, పరిశ్రమకి మనుగడ లేదు.!
ఏదన్నా సినిమా విడుదలవుతోందంటే చాలు, ముందుగానే నెగెటివిటీ మొదలైపోతోంది. దాంతో, సినిమాల మీద ఇంట్రెస్ట్ చచ్చిపోతోంది. దానికి తోడు అతి పబ్లిసిటీ కూడా సినిమా కొంప ముంచేస్తోంది.
అద్భుతాన్ని అద్భుతమని ప్రచారం చేసుకుంటే తప్పులేదుగానీ, ప్రతీదీ అద్భుతమంటే ఎలా.? ప్రచారమేమో అద్భుతం.. థియేటర్లలో బొమ్మ మరీ హేయం.. అలాంటప్పుడు జనమెందుకు థియేటర్లకు రావాలి.?
Also Read: రమ్యము.. నరేషము.! ఎంత అ‘పవిత్ర’ము.!
కాంబినేషన్ల పేరుతో జిమ్మిక్కులు, అనవసరపు పబ్లిసిటీతో ఖర్చు దండగ వ్యవహారాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలున్నాయ్.
కర్ణుడి చావుకి ఎన్ని కారణాలున్నాయోగానీ, తెలుగు సినిమా ప్రస్తుత దుస్థితికి మాత్రం సవాలక్ష కారణాలున్నాయ్. టిక్కెట్ల ధరల అంశం అందులో ఒకటి మాత్రమే.!