Anveshi Jain Seesa Song.. అన్వేషి జైన్, సోషల్ మీడియాలో హాటెస్ట్ సంచలనం.! ఓ వెబ్ సిరీస్‌తో పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. అది హిందీ వెబ్ సిరీస్. తెలుగులోనూ ఆ మధ్య ఓ వెబ్ సిరీస్ చేసింది.
ఇప్పుడు ఏకంగా ఐటమ్ బాంబ్ అవతారమెత్తింది ఓ తెలుగు సినిమాలో. అదీ రవితేజ సరసన చిందులేసింది. ‘రామారావు ఆన్ డ్యూటీ’ కోసం ‘సీసా..’ అంటూ సాగే స్పెషల్ ఐటమ్ సాంగ్ చేసింది అన్వేషి జైన్.
తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌కి వున్న స్పెషల్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇలా ఈ స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యిందో లేదో, అలా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. లిరికల్ వీడియో దుమ్ము రేపేస్తోంది.!
Anveshi Jain Seesa Song.. ఐటమ్ సాంగ్స్.. భక్తిగీతాలట.!
ఆ మధ్య ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ‘పుష్ప’ సినిమాలోని ‘ఊ అంటావా మావా..’ సాంగ్ గురించి మాట్లాడుతూ, ఐటమ్ సాంగ్స్ అంటే భక్తి గీతాలేనని సెలవిచ్చాడు.
Also Read: నభా నటేష్ ‘డేటింగ్’ పైత్యం.! ఛీ పాడు యాపారం.!
నిజమే, ఐటమ్ సాంగ్స్ అంటే భక్తి గీతాలే.! కానీ, భక్తి వేరే.! ఆ భక్తిలో మునిగి తేలే భక్తులు వేరే. ‘సీసా’ పాటతో అన్వేషి జైన్‌కి తెలుగునాట భక్తులు పెరిగిపోయరని అనగలమా.?
అనాల్సిందే తప్పదు.! ఎందుకంటే, ‘సీసా’ ఆ స్థాయిలో ఓ సెక్షన్ సినీ అభిమానుల్ని అలరించేస్తోంది మరి.!