Home » ఢిల్లీ వేదికగా జన సేనాని రాజకీయమ్.! ఈసారి లక్ష్యం చాలా పెద్దది.!

ఢిల్లీ వేదికగా జన సేనాని రాజకీయమ్.! ఈసారి లక్ష్యం చాలా పెద్దది.!

by hellomudra
0 comments
Pawan Kalyan

Pawan Kalyan Delhi Politics.. ఆంధ్ర ప్రదేశ్‌లో 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు లోక్ సభ సభ్యులు, ఓ రాజ్య సభ సభ్యుడు.

ఇదీ జన సేన పార్టీకి చెందిన ప్రజా ప్రతినిథుల లెక్క.

తెలంగాణలో గుండు సున్నా.! ముందు ముందు తెలంగాణతోపాటు కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ జన సేన పార్టీని బలోపేతం చేయాలనేది జనసేనాని వ్యూహం.

ఆ వ్యూహంతోనే, జన సేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీ వేదికగా రాజకీయం షురూ చేశారు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన జన సేన ప్రతినిథులతో, ఢిల్లీలో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.

దేశ సమైక్యత, సమగ్రత.. అంటూ, జన సేనాని పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని అత్యంత వ్యూహాత్మకంగా నిర్వహించారు.

తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచీ ప్రతినిథులు వచ్చినా, మెజార్టీ నాయకులు ఆంధ్ర ప్రదేశ్‌కి చెందినవారే.

Pawan Kalyan Delhi Politics.. 2029 ఎన్నికలే లక్ష్యంగా జన సేనాని జాతీయ వ్యూహం..

వచ్చే ఎన్నికల నాటికి.. అంటే, 2029 ఎన్నికల నాటికి ఆంధ్ర ప్రదేశ్‌లో మరింత బలోపేతమవడంతోపాటు, తెలంగాణలోనూ జన సేన పార్టీకి ఖచ్చితంగా ప్రజా ప్రతినిథులు వుండాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన.

అందుకు తగ్గట్టుగానే, ఢిల్లీ కేంద్రంగా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకమైన కార్యక్రమం నిర్వహించారు. అదేదో, తెలంగాణ రాజధాని హైద్రబాద్‌లోనే పెట్టొచ్చు కదా.? అంటే, దానికి మళ్ళీ వేరే కారణాలున్నాయి.

నేషనల్ మీడియా, జన సేన పార్టీ ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి మంచి కవరేజ్ ఇచ్చింది. జాతీయ పార్టీలు, జన సేన గురించి చర్చించుకోవడం మొదలు పెట్టాయి.

ఎలా చూసినా, జన సేనాని ఢిల్లీ వ్యూహం బాగానే వర్కవుట్ అయ్యిందని చెప్పుకోవాలి.

జన సేనకి చెందిన ఎంపీలు, జాతీయ స్థాయి రాజకీయ అంశాలపై అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా సేనాని చేసిన సూచనకి తగ్గట్లుగా ఆయా ఎంపీలు కార్యాచరణ ప్రారంభించడం గమనార్హం.

కేంద్రంలో అధికారంలో వున్న ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామి అయిన జన సేన, భవిష్యత్ భారత రాజకీయాల్లో తనదైన కీలక పాత్ర పోషించబోతోందన్నది నిర్వివాదాంశం.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group