Home » ఇంజనీరింగ్.! ఏ బ్రాంచ్ మంచిది.? ఎందులో చేరాలి.?

ఇంజనీరింగ్.! ఏ బ్రాంచ్ మంచిది.? ఎందులో చేరాలి.?

by hellomudra
0 comments
Engineering

Engineering Counselling Branches.. 2026 సంవత్సరానికి ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ షురూ అయ్యింది. జాతీయ స్థాయిలో జోసా కౌన్సెలింగ్ జరుగుతోంది.

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు అలానే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇనిస్టిట్యూట్స్.. ఇలా ఆయా విద్యా సంస్థల్లో ప్రవేశాలు జరుగుతున్నాయ్.

తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ విడివిడిగా ఈఏపీసెట్ నిర్వహించాయి. తెలంగాణ ఎంసెట్ ఫలితాలొచ్చేశాయ్. ఆంధ్ర ప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు వెల్లడి కావాల్సి వుంది.

త్వరలో తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.. ఆంధ్ర ప్రదేశ్ ఎంసెట్ కౌన్సెలింగ్ కూడా షురూ అవుతుంది.

జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో అవకాశాలు దక్కనివారు, వాటి కంటే, తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కళాశాలలే బెటర్.. అనుకునేవారూ ఈఏపీసెట్ మీద ఆధారపడతారు.

Engineering Counselling Branches.. ఏ బ్రాంచ్ మంచిది.?

ఇంతకీ, ఈసారి ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచ్ బెటర్.? ఈ ప్రశ్న ప్రతిసారీ చర్చనీయాంశమే. ఇంకేముంది.? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్.. ఇదే టాప్ క్లాస్.!

ఔను, ఎక్కడ విన్నా ఇదే మాట. మరి, మిగతా బ్రాంచీల సంగతూంటి.? ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజనీరింగ్.. ఈ బ్రాంచీల గురించి ఎవరూ ఎందుకు మాట్లాుకోవడంలేదు.?

ఒకవేళ సీఎస్ఈ రాకపోతే, ఆ వెంటనే ఈసీఈ బెస్ట్ ఆప్షన్ అనుకుంటారు చాలామంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈఈఈ, మెకానికల్, సివిల్ వైపు మొగ్గు చూపుతారు.

జాతీయ స్థాయి విద్యా సంస్థల్లోనూ దాదాపు ఇదే పద్ధతి ఫాలో అవుతుంటారు విద్యార్థులు. విద్యార్థుల తల్లిదండ్రులూ తమ పిల్లల్ని అటువైపే నడిపిస్తుంటారు.

ఇంకా చాలా బ్రాంచీలు ఇంజనీరింగ్‌లో వున్నాయి.. అవసలు ఎప్పుడూ చర్చనీయాంశమే కావు. కొంతమంది చేరతారు, వాటి గురించి పట్టించుకునేవారెవరూ వుండరు.

గతంలోలానే, ఈ ఏడాది కూడా చాలా ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగానికి అదనపు కోటా కల్పిస్తూ, ఇతర బ్రాంచీల్లో సీట్లను కుదించుకుంటుండడం మొదలైంది.

కొన్నాళ్ళకు ఇంజనీరింగ్ అంటే, సీఎస్ఈ తప్ప, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇంతర బ్రాంచీల్ని వుంచుకునే పరిస్థితీ కనిపించదేమో.!

అదే జరిగితే, దేశానికి అవసరమైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ ఇంజనీర్లు ఎలా వస్తారు.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్.

సీఎస్ఈ మీద కూడా ఆసక్తి తగ్గుతోంది. ఏఐ ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ.. ఈ విభాగాలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు విద్యార్థులు.

ఏమో, భవిష్యత్ ఇంజనీరింగ్ విద్య ఎలాంటి టర్న్ తీసుకుంటుందోగానీ.. దేశానికి, ఇంజనీరింగ్‌లో అన్ని విభాగాలకు చెందిన యువత అవసరం.

ఫుడ్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ టెక్నాలజీ, ఏరోనాటికల్, ఏరో స్పేస్ ఇంజనీరింగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే, బోల్డన్ని బ్రాంచీలు ఆయా విద్యా సంస్థల్లో దేశవ్యాప్తంగా అందుబాటులో వున్నాయ్.

వాటి పట్ల అవగాహన విద్యార్థుల్లోనూ, విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ లేకపోవడం శోచనీయం. ఇంజనీరింగ్ అంటేనే, అందులో ప్రతి విభాగమూ ప్రత్యేకం.

ఏది మంచిది.? అన్న చర్చే అర్థరహితం. ఎంచుకున్న బ్రాంచ్‌లో ఎంతవరకు రాణించగలం.? అన్నదే ముఖ్యమిక్కడ.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group