Home » సమంత గనుక హిట్టు కొట్టిందంటే బంగారమే కదా.!

సమంత గనుక హిట్టు కొట్టిందంటే బంగారమే కదా.!

by hellomudra
0 comments
Samantha Ruth Prabhu Maa Inti Bangaaram

Samantha Maa Inti Bangaram.. సమంతకి తొలుత నాగచైతన్యతో వివాహమైంది.. ఆ తర్వాత, ఇద్దరూ విడిపోయారు. నాగచైతన్యకి శోభిత ధూళిపాళతో పెళ్ళి జరిగింది.

మరోపక్క, సమంత ఏమో రాజ్ నిడిమోరుని పెళ్ళాడింది. సో, ఇద్దరివీ ఇప్పుడు వేర్వేరు జీవితాలు. కానీ, ఇంకా కొందరు సమంత – నాగచైతన్య ‘జంట’ దగ్గరే ఆగిపోయారు.

అక్కినేని నాగచైతన్యని సమంత మోసం చేసిందనీ.. కాదు కాదు, సమంతనే నాగచైతన్య మోసం చేశాడనీ.. సోషల్ మీడియాకెక్కి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా, సమంత నుంచి ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో, నాగచైతన్య అభిమానుల పేరుతో కొందరు సమంతని ట్రోల్ చేస్తున్నారు.

Samantha Maa Inti Bangaram.. అభిమానం ముసుగులో ట్రోలింగ్..

అదే సమయంలో, సమంత అభిమానుల ముసుగులో నాగచైతన్యని ట్రోల్ చేస్తుండడం గమనార్హం. ఇదంతా రీచ్ కోసమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ ట్రోలింగ్ సంగతి పక్కన పెడితే, ‘మా ఇంటి బంగారం’ సినిమాకి ప్రీ రిలీజ్ బజ్ బాగానే వుంది. ‘పెద్ది’ సినిమా ఇచ్చిన ఊపుతో, తెలుగు సినీ పరిశ్రమ మళ్ళీ కళకళ్ళాడుతుందన్న చర్చ జరుగుతోంది.

ఒకవేళ ‘మా ఇంటి బంగారం’ సినిమా గనుక హిట్టయితే, కాసుల కనక వర్షం కురిసినట్లే. ప్రీ రిలీజ్ బజ్ బావుండడంతో, నాన్ థియేట్రికల్ హక్కులు బాగానే అమ్ముడుపోయాయ్.

పెట్టిన పెట్టుబడి, నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే ‘మా ఇంటి బంగారం’ నిర్మాతలకి వచ్చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

నిర్మాత ఎవరో కాదు, సమంతే. తన భర్త రాజ్ నిడిమోరు ఈ చిత్ర నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. నందిని రెడ్డి దర్శకురాలు.

సమంత, గృహిణిగా చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కాస్తా ప్రమోషనల్ వీడియోలతో జనంలోకి బాగా వెళ్ళిపోయాయి.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group