Anitha Vangalapudi Gudivada Amarnath.. గుడివాడ అమర్నాథ్ అంటే, ఒకప్పుడు టీడీపీ నేత, ఆ తర్వాత వైసీపీ నేత. వైసీపీ హయాంలో మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం వైసీపీ నాయకుడిగానే వున్నారు.
రాజకీయాలన్నాక విమర్శలు సహజం. ఈ క్రమంలోనే ఓ రాజకీయ విమర్శ చేసేశారు.. అదీ, ప్రస్తుత మంత్రి మీద. ఆ మంత్రి పేరు వంగలపూడి అనిత.
తెలుసు కదా, వంగల పూడి అనిత అంటే టీడీపీ నేత అని. పైగా, వంగలపూడి అనిత ప్రస్తుతం హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వంగలపూడి అనిత మీద గుడివాడ అమర్నాథ్ కేవలం రాజకీయ విమర్శ చేస్తే, అది వేరే సంగతి. కానీ, ఆయన విమర్శలు చేసే క్రమంలో, వంగలపూడి అనిత మేకప్ గురించి కామెంట్ చేశారు.
’మేకప్ మంత్రి‘ అంటూ, వంగలపూడి అనిత మీద గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఓ మహిళ మీద ఇంత దిగజారుడు కామెంట్ ఎలా చేశావ్.? అని అందరూ తిట్టిపోస్తున్నారు.
Anitha Vangalapudi Gudivada Amarnath.. రాజకీయ విమర్శల హద్దుని నిస్సిగ్గుగా చెరిపేసి..
దళిత మంత్రి, పైగా విద్యాధికురాలు.. గతంలో టీచర్‌గా కూడా పని చేశారు వంగలపూడి అనిత. రాజకీయాల్లో విమర్శల హద్దు ఏనాడో చెరిగిపోయింది.
జుగుప్సాకరమైన, అత్యంత జుగుప్సాకరమైన తిట్లు తిట్టుకోవడం రాజకీయాల్లో నయా ట్రెండ్. వైసీపీకే చెందిన మాజీ మంత్రులు రోజా, కొడాలి నాని తదితరులు ఈ లిస్టులో అగ్రస్థానంలో వుంటారు.
బహుశా, గుడివాడ అమర్నాథ్ కూడా, మెరుగైన ర్యాంకు సంపాదించడానికి పోటీ పడుతున్నారేమో, ఈ స్థాయికి దిగజారిపోయారు.
ఇంతకీ, వంగలపూడి అనిత మీద ‘మేకప్ మంత్రి’ అనే కామెంట్ చేయడం ద్వారా ఏ రాజకీయ లబ్దిని గుడివాడ అమర్నాథ్ ఆశించి వుండొచ్చు.?
ఏదో, అనుకోకుండా ఆయన అలా అనేసి వుండొచ్చు.. పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చుకుంటే సరిపోయేది. కానీ, తన వ్యాఖ్యల్ని గుడివాడ అమర్నాథ్ సమర్థించుకుంటున్నారు.
Also Read: కాక్రోచ్ జనతా పార్టీ.! దేశంలో ఈ కొత్త బొద్దింకల గోలేంటి.?
చిత్రంగా వైసీపీ నాయకులంతా, గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని అంటున్నారు. అందులో వైసీపీకి చెందిన పలువురు మహిళా నేతలు, కొందరు ప్రజా ప్రతినిథులు కూడా వున్నారు.
ఏ సందేశాన్ని సభ్య సమాజానికి వైసీపీ ఇవ్వాలనుకుంటోందో ఏమో.! ఇంతకీ, వంగలపూడి అనిత మేకప్ మీద, గుడివాడ అమర్నాథ్‌కి ఎందుకంత అక్కసు.?
కావాలంటే, గుడివాడ అమర్నాథ్ కూడా మేకప్ వేసుకోవచ్చు. చీర కట్టు కోవచ్చు, చేతులకి గాజులు కూడా వేసుకోవచ్చు. కాదని ఎవరంటారు.?
