Taapsee Pannu Blue Saree.. నీలి రంగు చీరలోన.. అంటూ ఓ కథానాయిక అందాన్ని అభివర్ణిస్తాడో సినీ కవి.! తాప్సీని ఇలా చూస్తే, కుర్రకారుకి ఆ ‘నీలి రంగు చీరలోన’ పాట గుర్తుకురావడంలో వింతేముంది.?
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిన తాప్సీ, ఇప్పుడు బాలీవుడ్‌కే పరిమితమైపోయింది. అక్కడ వరుసగా హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయింది తాప్సీ.
ఆ క్రమంలో అసలు మూలాల్నే మర్చిపోయి, సౌత్ సినిమాపై అవాకులు చవాకులు పేలింది. తెలుగు మేకర్లనూ తనదైన శైలిలో ఆడి పోసుకుంది.
సౌత్‌లో తనను గ్లామర్ కోసమే వాడేసుకున్నారని గగ్గోలు.!
బాలీవుడ్లో అంతకు మించి బికినీ షో చేసి మతులు పోగొట్టిన తాప్సీ.!
చెప్పేదొకటి.. చేసేది ఇంకొకటి.! డైనమిజం సంగతేమోగానీ, తాప్సీ అంటే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్.!
వివాదాల సంగతెలా వున్నా, తనదైన నటనతో డైనమిక్ రోల్స్‌లోనూ మెప్పించిన బ్యూటీ.!
Mudra369
ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం,, మళ్లీ సౌత్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడంలాంటివి జరిగాయనుకోండి. ఎంతైనా తనను తాను బాలీవుడ్ హీరోయిన్గా ప్రమోట్ చేసుకునేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంటుంది తాప్సీ పన్ను.
Taapsee Pannu Blue Saree.. తాప్సీ అందాల ఆదమరుపు..
ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమా ప్రమోషన్ల నిమిత్తం తనదైన శైలిలో ఫోటో షూట్లు చేయించుకుంది తాప్సీ (Taapsee Pannu). నీలి రంగు చీరలో వయ్యారాలు పోయింది.

ఆదమరిచి అందాలారేస్తూ అభిమానుల హృదయాల్ని కొల్లగొట్టేస్తోందీ అందాల తాప్సీ పన్ను. ఆ నీలిరంగు చీరలో తాప్సీని చూస్తూ నిజంగానే కుర్రకారు ఆదమరిచిపోతున్నారంటే అతిశయోక్తి కాదేమో.
Also Read: Raashi Khanna: అందాల రాశి.. అందమంతా పోగేసి.!
నీలి చీరలో అలా అలా అందంగా పోజివ్వడమే కాదండోయ్. వాలు కుర్చీలో అందంగా పవళిస్తూ చాలా కళాత్మకంగా కనిపిస్తోంది ఈ పోజుల్లో తాప్సీ పన్ను.
అసలే సొట్ట బుగ్గల సుందరి. ఆ పై స్లీవ్ లెస్ జాకెట్టు కనికట్టు.. నడుం బిగి కట్టు.. ఇలా ఏమని వర్ణించేట్టు..!
ఈ నీలి రంగు వయ్యారాలు.. కేవలం సినిమా ప్రమోషన్ల కోసమే అన్నట్లుగా కాకుండా, ఈ స్పెషల్ ఫోటో షూట్‌తో ఘాటెక్కిస్తూ, నెటిజన్లు షేకెత్తిస్తోంది తాప్సీ (Taapsee Pannu).