Ram Gopal Varma Nijam.. రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ ‘నిజం’ చెప్తానంటున్నాడు.! వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే.. అన్న సామెత చందాన తయారైంది వ్యవహారం.
‘నిజం’ పేరుతో ఓ యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇందులో ఇంటర్వ్యూలు వుంటాయట. ప్రశ్నలు, విశ్లేషణలు.. వాట్ నాట్.. చాలానే వుంటాయన్నది ఆర్జీవీ ఉవాచ.!
ముందైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుతో మొదలు పెడతాడట ‘నిజం’ చెప్పడం.! ఆ నిజం ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.!
Ram Gopal Varma Nijam.. ఆర్జీవీ కామెడీ చేస్తే.?
మొన్నామధ్య ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ అనే సినిమా తీశాడు రామ్ గోపాల్ వర్మ. అదో పెద్ద కామెడీ అయిపోయింది.
ఓ వంగవీటి.. ఓ రక్త చరిత్ర.. ఓ లక్ష్మీస్ ఎన్టీయార్.. ఏనాడన్నా ఆర్జీవీ నిజాలు చెప్పాడా.?
కొత్తగా ఇప్పుడు నిజాలు చెబుతానంటున్నాడు..
అసలు నిజం అంటే ఏంటి.?
నిప్పులాంటి నిజానికి తుప్పు పట్టిస్తున్న ఆర్జీవీ.!
ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఆర్జీవీ నిజం.?
ఆర్జీవీ చెప్పబోతున్న నిజం వెనుకాల అబద్ధమేంటి.?
ఆ అబద్ధంలో దాగున్న అసలు నిజమేంటి.?
Mudra369
‘రక్త చరిత్ర’ అంటూ చాలాకాలం క్రితం ఇంకో సినిమా తీశాడు. అందులో నిజం ఎంతో ప్రపంచమంతా చూసింది.
సో, ‘నిజం’ యూ ట్యూబ్ ఛానల్ నుంచి అస్సలేమాత్రం నిజాలు ఆశించకూడదు. వీటిల్లో జస్ట్ ఆర్జీవీ మార్కు పైత్యం మాత్రమే కనిపిస్తుంది.
గుడ్డి ఫాలోవర్స్ కోసమే..
ఆర్జీవీని కొంతమంది గుడ్డిగా ఫాలో అవుతుంటారు. అలాంటి గుడ్డి ఫ్యాన్స్ కోసమే ఆర్జీవీ ఇలాంటి వేషాలేస్తుంటాడన్నది బహిరంగ రహస్యం.
Also Read: ‘శాకుంతలం’ డిజాస్టర్: సమంత ‘కర్మ’ సిద్ధాంతం.!
పైగా, ఆర్జీవీ ఓ రాజకీయ పార్టీకి వత్తాసుపలుకుతుంటాడు. ఆ పార్టీకి ఎలివేషన్స్ ఇచ్చేందుకోసం ఆర్జీవీ ‘నిజం’ పేరుతో కొత్త స్టంట్ మొదలు పెట్టాడన్నమాట.
మొదటి ఎపిసోడ్‌లో వివేకానంద రెడ్డిది హత్య కాదు.. గుండె పోటుతో, రక్తపు వాంతులతోనే ఆయన చనిపోయినట్లుగా ఆర్జీవీ తీర్పు ఇవ్వబోతున్నాడేమో తన నిజం ఛానల్ ద్వారా.?
Mudra369
నిజం వెనుక అబద్ధం.. అబద్ధంలో దాగున్న నిజం.. లాంటి పెద్ద మాటలెందుకుగానీ, అసలు ‘నిజం యూ ట్యూబ్’ ఛానల్ వెనుక అసలు నిజమేంటి.?