Kajal Aggarwal Glamorous Cracker.. హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్లైలింగ్‌కి పెట్టింది పేరు.! స్టైలింగ్‌లో ట్రెండ్ సెట్ చేయడంలో కాజల్ రూటే సెపరేటు.!
సినిమాలతో బిజీగా వున్నా.. ఫ్యామిలీ లైఫ్‌తో ఇంకా బిజీగా వున్నా.. తన ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడంలో మాత్రం ఎప్పుడూ అప్‌డేట్ వుంటుంది కాజల్ అగర్వాల్.
లేటెస్ట్‌గా ‘ఫైర్ క్రాకర్..’ అంటూ క్యాప్షన్‌తో కొన్ని ఫోటోలను తన పర్సనల్ ఇన్‌స్టా హ్యాండిల్‌లో కాజల్ అగర్వాల్ పోస్ట్ చేసింది. ఈ ఫోటోస్ నెట్టింట సరికొత్తగా వైరల్ అవుతున్నాయ్.

హీరోయిన్లకు పెళ్లి, పిల్లలు తర్వాత ఈ రేంజ్‌లో ఫాలోయింగ్ వుంటుందా.? అనేలా తనను తాను మౌల్డ్ చేసుకుని.. ట్రెండ్ సెట్టర్‌లా మారింది కాజల్ అగర్వాల్.
స్టార్ హీరోల సరసన మంచి జోడీ అనిపించుకుంటూనే.. తనదైన టేస్ట్ ట్రెండీ లుక్స్‌ని సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసుకుంటూ అభిమానులకు సరికొత్త ట్రీట్ ఇస్తూనే వుంటోంది.
Kajal Aggarwal Glamorous Cracker.. ట్రెండీ అండ్ క్లాసిక్ లుక్స్‌లో చందమామ మెరుపుల్.!
తాజాగా ఓ డిఫరెంట్ అవుట్ ఫిట్‌లో కాజల్ అగర్వాల్ దర్శనమిచ్చింది. పింక్ కలర్ ధోతీ తరహా స్కర్ట్ ధరించింది. దీనికి ముందు భాగంలో వున్న డ్రాస్టింగ్స్ డిజైన్ ఈ డ్రెసకి ట్రెండీ టచ్ ఇచ్చింది.
టాప్‌లో వేసిన నేవీ బ్లూ కలర్ కార్పెట్ టైప్ క్రాప్ బ్లౌజ్ ఈ ట్రెండీ లుక్‌ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లింది.
ఈ బ్లౌజ్‌పై వున్న సున్నితమైన డిజైన్ వర్క్ అలాగే, బోర్డర్‌పై రంగు రంగుల డీటెయిలింగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయ్.
దీనికి తోడు భుజాలపై నుంచి కింద వరకూ జారుతున్నట్లుగా వున్న లైట్ గ్రే కలర్ షీర్ లాంగ్ కేప్ టోటల్ డ్రస్‌కీ అలాగే కాజల్ లుక్‌కీ రాయల్ హై ఫ్యాషన్ టచ్ ఇచ్చింది.
రియల్ పార్ట్‌నర్‌తో రీల్ రొమాంటిక్ పోజుల్..
ఈ కేప్ అంచులపై వున్న డిఫరెంట్ కలర్ కలర్ జిమో మెట్రిక్ బ్లాక్స్ డిజైన్ డిఫరెంట్‌గా ఎలివేట్ అవుతోంది. ఇంత హెవీ డిజైనర్ కాస్ట్యూమ్‌కి జ్యుయలరీ మ్యాచ్ చేయడంలో మంచి టేస్ట్ వుండాలి.
కానీ, సింపుల్ స్టేట్‌మెంట్ జుంకాలూ, చేతికి బ్రాస్‌లెట్ మాత్రమే ధరించి, చాలా డిగ్నిఫైడ్‌గా బ్యాలెన్స్ చేసింది.సింపుల్ హై హీల్ వేసి, చాలా కాన్ఫిడెంట్‌గా నడిచొస్తున్న ఫైర్ క్రాకర్‌లా కనిపిస్తోంది.

అన్నట్లు ఈ ఫోటో షూట్‌లో కాజల్ తన హజ్బెండ్‌ని కూడా ప్రమోట్ చేసినట్లుంది. భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి రొమాంటిక్ పోజులిచ్చింది.
రియల్ లైఫ్ పార్ట్‌నర్‌తో కలిసి కాజల్ అగర్వాల్ హాయిగా నవ్వేస్తూ దిగిన ఈ ఫోటోలు చాలా నేచురల్‌గా ఎట్రాక్ట్ చేస్తున్నాయ్.
అందుకేనేమో ఈ స్పెషల్ ఫోటో షూట్ మరియు కాజల్ అగర్వాల్ ఈ న్యూ లుక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయ్.