Spy Movie Jhoom Jhoom.. యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ కొత్త సినిమా ‘స్పై’ నుంచి ఓ మెలోడియస్ సాంగ్ (లిరికల్) విడుదలయ్యింది.!
‘కార్తికేయ-2’ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన నిఖిల్ సిద్దార్ధ, ఈ ‘స్పై’తో తన రేంజ్‌ని మరింత పెంచుకోవాలనుకుంటున్న సంగతి తెలిసిందే.
నిఖిల్ సిద్దార్ధ (Nikhil Siddhartha) సరసన ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో ఆమెకిదే తొలి సినిమా.
Spy Movie Jhoom Jhoom.. జూమ్.. జూమ్.. రొమాంటిక్ బూమ్.!
జూమ్.. జూమ్.. అంటూ సాగే మెలోడియస్ సాంగ్‌ని క్యూట్ అండ్ లవ్లీగా డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. లీడ్ పెయిర్ మధ్య ఆన్ స్క్రీన్ రొమాంటిక్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందనిపిస్తోంది.
లిరికల్ సాంగ్‌లో విజువల్స్, సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా వున్నాయి. చక్కటి మ్యూజిక్.. మంచి లిరిక్స్.. పాటని వేరే లెవల్‌కి తీసుకెళుతున్నాయ్.
Also Read: అనసూయపై విజయ్ దేవరకొండ ‘పెయిడ్’ ట్రోలింగ్.?
విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్, అనురాగ్ కులకర్ణి అలాగే రమ్య బెహ్రా వాయిస్.. ఈ పాటకి స్పెషల్ టోన్ ఇచ్చాయి.