Chiru Leaks Pawan Kalyan.. మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఏదన్నా విషయాన్ని లీక్ చేస్తే ఆ కిక్కే వేరప్పా.!
తన సినిమా టైటిల్ దగ్గర్నుంచి.. సినిమాలకు సంబంధించిన కీలక అంశాలపై ‘చిరు లీక్స్’ కాస్తా, మెగా లీక్స్ అయిపోతున్నాయ్.
ఈ ‘లీకు’ల ట్రెండు విషయమై కొందరు కొన్ని రకాలుగా వెకిలి కూతలు కూస్తున్నా.. మెగాస్టార్ చిరంజీవి.. అంటే ఆ కిక్కే వేరప్పా.! చిరు లీక్స్‌కి వుండే క్రేజ్ వేరప్పా.!
Chiru Leaks Pawan Kalyan.. భోళా శంకర్.. పవన్ కళ్యాణ్..
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘భోళా శంకర్’ నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు చిరంజీవి (Mega Star Chiranjeevi). అది కూడా, ‘చిరు లీక్స్’ పేరుతో.
తమ్ముడు పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) మేనరిజమ్స్‌ని అనుకరిస్తూ.. చిరంజీవి సృష్టించిన ఫన్, ‘భోళా శంకర్’ సినిమాకి ఓ హైలైట్ కానుంది.

ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ‘చిరు లీక్స్’ పేరుతో వెల్లడించడం గమనార్హం. ఇంకేముంది.? చిరంజీవిపై ఇంకో వైపు నెగెటివిటీ షురూ.!
అభిమానులు (Mega Fans) మాత్రం ‘నువ్వు మామూలుడోవి కాదు బాసూ..’ అంటూ మురిసిపోతున్నారు.
తమ్ముడ్ని అనుకరించిన అన్నయ్య..
అన్నయ్య చిరంజీవిని (Megastar Chiranjeevi) ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా కోసం అనుకరించాడు తమ్ముడు పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan).
Also Read: Bhumi Pednekar.. పదహారేళ్ళకే.. ఆ కోరిక.!
ఇప్పుడేమో తమ్ముడు పవన్ కళ్యాణ్‌ని ‘భోళా శంకర్’ కోసం అన్నయ్య చిరంజీవి అనుకరిస్తున్నాడన్నమాట. తమన్నా ఈ ‘భోళా శంకర్’లో హీరోయిన్.
తమిళంలో ఘనవిజయం సాధించిన ‘వేదాలం’కి ఇది తెలుగు రీమేక్. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ ‘భోళా శంకర్’ తెరకెక్కుతోంది.
చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. సుశాంత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆగస్ట్ 11న ‘భోళా శంకర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సరికొత్త రికార్డులు సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి, ఈ ‘భోళా శంకర్’తో మరోమారు బాక్సాఫీస్ వద్ద తన స్టామినా చాటబోతున్నారు.
