Table of Contents
Pawankalyan Renudesai Divorce Reason.. ప్రేమించి పెళ్ళి చేసుకున్నవాళ్ళు.. విడాకులు తీసుకున్నారంటే, ఎక్కడో తప్పు జరిగి వుండాలి.!
వాళ్ళిద్దరి మధ్యా ప్రేమ తగ్గడం వల్లనో.. అభిప్రాయ బేధాల వల్లనో.. కారణం ఏదైనా కావొచ్చు.. విడాకులు ఈ రోజుల్లో సర్వసాధారణం.
నిజానికి, విడాకులు.. అంటే ఆశ్చర్యకరమైన వ్యవహారం కాదు. ఎప్పటినుంచో వున్నదే. సినిమా స్టార్స్ విడాకుల చుట్టూ మీడియా అత్యుత్సాహం, సామాన్య ప్రజల ఆసక్తి మామూలే.!
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్.. ఎందుకు విడిపోయారు.?
కొన్నేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ చట్ట బద్ధంగా విడిపోయారు. ఇద్దరికీ విడాకులు జరిగిపోయాయ్.! ఇప్పుడు ఆ విడాకుల గురించిన పోస్టుమార్టమ్ అనవసరం.!
కానీ, ‘పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తప్పు చేశారు..’ అంటోంది ఆయన మాజీ భార్య రేణు దేశాయ్. అదే సమయంలో, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చాలా మంచోడనీ చెబుతోంది.
‘డబ్బు పట్ల వ్యామోహం లేదు.. సమాజం పట్ల బాధ్యత వుంది.. ఆయనకు నేను మద్దతిస్తున్నా..’ అని రేణు దేశాయ్ చెప్పడం ఆశ్చర్యకరమే.

అయినాగానీ, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన విషయంలో తప్పు చేశాడనే మాటని రేణు దేశాయ్ (Renu Desai) రిపీట్ చేస్తోంది.
డబ్బు పట్ల వ్యామోహం లేనోడు.. సమాజం పట్ల బాధ్యత కలిగినోడు.. భార్య విషయంలో ఎలా తప్పు చేస్తాడు.? కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది.
సమంత, నాగచైతన్య..
సమంత – నాగచైతన్య ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.. విడిపోయారు.! మీడియాలో, సోషల్ మీడియాలో ఈ విడాకులపై పోస్టుమార్టమ్ జరుగుతూనే వుంది ఎప్పటికప్పుడు.

‘మా ఇద్దర్నీ ఓ గదిలో వుంచితే, షార్ప్ ఆబ్జెక్ట్స్ అస్సలు వుండకూడదు’ అంటూ సమంత, నాగచైతన్య మీద తన కోపాన్ని పరోక్షంగా ఓ ఇంటర్వూలో వెల్లడించింది.
కానీ, నాగచైతన్య (Akkineni Naga Chaitanya) ఎప్పుడూ సమంత (Samantha Ruth Prabhu) మీద ఎలాంటి కామెంట్ చేయలేదు.. విడాకుల తర్వాత.
Pawankalyan Renudesai Divorce Reason.. విడాకులకు ఓ కారణం కావాలి.!
ఔను, విడాకులకు ఓ కారణం కావాలి.! ఎందుకు విడిపోయావ్ పవన్ కళ్యాణ్ నుంచి.? అన్న ప్రశ్న వస్తుంది కాబట్టి, పవన్ కళ్యాణ్ తన విషయంలో తప్పు చేశాడని రేణు దేశాయ్ చెప్పి వుండొచ్చు.
పవన్ కళ్యాణ్ మీద రేణు దేశాయ్ (Renu Desai) గతంలో ఓ నింద మోపారు. ఆ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.
Also Read: నడి రోడ్డు మీద ‘నిస్సిగ్గు రాజకీయం’ గుడ్డలూడదీసిన ‘బ్రో’.!
ఒకవేళ పవన్ ఆ వీడియోకి కౌంటర్ ఎటాక్ ఇవ్వాలనుకుంటేనో.! ఆ లెక్క వేరే వుంటుంది. కానీ, మౌనంగా వుండిపోయారాయన. అంటే, తప్పు చేశారని కాదు.! అది ఆయన హుందాతనం.!
తప్పుంటే.. అది రెండు వైపులా వుంటుంది.! పవన్ కళ్యాణ్ పెదవి విప్పలేదు.. విప్పరు కూడా.! ఇక, రేణు దేశాయ్ అంటారా.? ఆమె మాట్లాడుతూనే వుంది.! మాట్లాడుతూనే వుంటుంది.!
మాట్లాడుతోంది కాబట్టి.. అదే నిజమనుకుంటే పొరపాటు.! పెదవి విప్పడంలేదు కాబట్టి, తప్పుందనుకోవడం మూర్ఖత్వం.!