Poonam Pandey Is Alive.. నటి పూనమ్ పాండే చనిపోయిందట.! నిన్న ఆమె అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో దర్శనమిచ్చిన పోస్ట్ చూసి అంతా షాక్ అయ్యారు.
సర్వైకల్ క్యాన్సర్ బారినపడి పూనమ్ పాండే ప్రాణాలు కోల్పోయారన్నది ఆ పోస్ట్ సారాంశం. దాంతో, అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
నాలుగు రోజుల క్రితమే ఉత్సాహంగా కన్పించిన పూనమ్ పాండే, ఇంతలోనే అలా ఎలా చనిపోతుంది.? అని చాలామందికి డౌటానుమానాలు వచ్చాయ్.
పూనమ్ పాండే అంటేనే పబ్లిసిటీ స్టంట్స్‌కి కేరాఫ్ అడ్రస్. అయినాగానీ, ‘చావు’ గురించి ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు ఎలా చేయగలుగుతుందని కొందరు అనుకున్నారు.
Poonam Pandey is Alive.. చనిపోలేదు.. బతికే వుంది.!
కానీ, అందరి అంచనాల్నీ తల్లకిందులు చేస్తూ.. అందరికీ ఇంకోసారి షాక్ ఇస్తూ, పూనమ్ పాండే ‘నేను బతికే వున్నాను’ అంటూ ఇంకో వీడియోను పోస్ట్ చేసింది.
సర్వైకల్ క్యాన్సర్ చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోందని పూనమ్ పాండే వ్యాఖ్యానించింది ఆ వీడియోలో.
‘నేను ఎవర్నయినా బాధ పెట్టి వుంటే నన్ను క్షమించండి. కానీ, నా మరణ వార్తతో దేశమంతా సర్వైకల్ క్యాన్సర్ గురించిన చర్చ జరిగింది. దీనికోసమే ఇదంతా చేయాల్సి వచ్చింది’ అని పేర్కొంది పూనమ్ పాండే.
ఈ విషయంలో పూనమ్ పాండేని ఎవరైనాసరే అభినందించాల్సిందే. పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోయిందన్న వార్త.. నిజంగానే, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది.
సర్వైకల్ క్యాన్సర్ ఎలా వస్తుంది.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఇలా పలు అంశాలపై వివిధ మీడియా సంస్థలు కథనాల్ని తెరపైకి తెచ్చాయి.
Also Read: HanuMan సక్సెస్ సీక్రెట్ ఇదీ.!
అన్నట్టు, దేశంలో 9 నుంచి 14 ఏళ్ళ బాలికలకు వ్యాక్సినేషన్ చేయడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్‌ని నివారించవచ్చునని కేంద్రం చెబుతున్న సంగతి తెలిసిందే.
వ్యాక్సిన్లతో నివారించదగ్గ క్యాన్సర్ ఇదొక్కటే.! అందుకే, పూనమ్ పాండే.. పబ్లిసిటీ స్టంటే చేసినా.. తన మరణ వార్తతో, సర్వైకల్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించేలా చేయగలిగింది.

సర్వైకల్ క్యాన్సర్.. అత్యంత వేగంగా భారతదేశంలో విస్తరిస్తోంది.. క్యాన్సర్‌ని తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స తీసుకుని, కోలుకోవడానికి అవకాశం వుంటుంది.
వ్యాక్సిన్ కూడా అందుబాటులో వుంది గనుక, ఇంట్లోని బాలికలకు బాధ్యతగా వ్యాక్సిన్ ఇప్పించగలిగితే, సర్వైకల్ క్యాన్సర్‌ని పూర్తిగా నివారించడానికి ఆస్కారం ఏర్పడుతుంది.