Table of Contents
Snake Bite Revenge Drama.. అనగనగా ఓ పాము.. అనగనగా ఓ ఇరవై నాలుగేళ్ళ కుర్రాడు.! ఇద్దరి మధ్యా ఓ చక్కటి కమ్యూనికేషన్.! కాకపోతే, భయంకరమైన విషయమిది.!
అతని పేరేమో వికాస్ దూబే. ఉత్తర ప్రదేశ్‌లోని ఫతేపూర్‌కి చెందిన యువకుడు.! అతన్ని ప్రతి శనివారం ఓ పాము కాటేస్తోందిట.!
ఇంతకీ, పాము ఎందుకు కాటేస్తుంది.? ఔను, కాటేస్తోంది.. ముద్దు పెట్టడంలేదు.! కాటు భయంకరమైనదే.! ఇప్పటికే ఏడు సార్లు కాటేసిందట. అదీ జస్ట్ 40 రోజుల వ్యవధిలో.
Snake Bite Revenge Drama.. అన్ని సార్లు కాటేస్తే ఎలా బతికావ్.?
ఏడు సార్లు పాము కాటేస్తే, వికాస్ దూబే ఎలా బతికాడబ్బా.? అదో మిస్టరీ.! ఆ పామే స్వయంగా చెప్పిందట, మొత్తం తొమ్మిది సార్లు కాటేయనున్నట్లు.!
ప్రస్తుతానికైతే ఏడు కాట్లు విజయవంతంగా పూర్తయ్యాయ్. ఇంకో రెండు కాట్లు వేస్తే, వికాస్ దూబే ప్రాణం పోతుందట. స్వయంగా ఆ పామే ఈ విషయాన్ని తనతో చెప్పినట్లు వికాస్ దూబే అధికారులకు వెల్లడించాడు.
పాము కాటుకి చికిత్స చేయించుకోవడం ఖరీదైన వ్యవహారమనీ, ఈ కారణంగా తాను ఆర్థికంగా చితికిపోయానని వాపోతున్నాడు వికాస్ దూబే.
దాంతో, అధికారులు అతనికి ఉచితంగా యాంటీ స్నేక్ వెనమ్ చికిత్స అందించాలని నిర్ణయించారట. కాస్త చిత్రంగా వుంది కదా.!
నిజమేనంటారా.?
సర్లేగానీ, అసలు ఇదంతా నిజమేనా.? ఏమో, నేషనల్ మీడియాలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. వెబ్ మీడియా, యూ ట్యూబ్ ఛానళ్ళూ.. రకరకాల కథనాల్ని ప్రచారంలోకి తెస్తున్నాయ్.

ఎక్కడుంది ఆ పాము.? దాన్ని కనిపెట్టి, బంధించేస్తే సరిపోతుంది కదా.? అరరె, ఇంత మంచి అవుడియా ఎవరికీ రాకపాయె.!
నిజానికి, ఇలాంటి వార్తలు, కట్టు కథలు చాలానే వింటుంటాం. హ్యూమన్ ఇంట్రెస్ట్ పేరుతో వీటికి బోల్డంత ప్రచారం జరుగుతుంటుంది.
పాములు పగబడతాయా అసలు.?
సైంటిఫిక్ యాంగిల్లో చూస్తే, పాములు అసలు పగబట్టే ఛాన్సే వుండదు. ఎవర్నీ వెతుక్కుని వెళ్ళి పాములు కాటేయవు.
తమకు ప్రాణ హాని జరుగుతుందేమోనన్న భయంతో హెచ్చరికగా పాములు కాటేస్తాయ్. ప్రాణం కాపాడుకోవడానికే, విషాన్ని చిమ్ముతాయ్ పాములు.
Also Read: లక్షద్వీప్‌కి ఆ ‘స్థాయి, సత్తా’ వున్నాయా.?
అంతే కాదు, ఆహారం కోసం కూడా పాములు విషాన్ని ఉపయోగిస్తాయ్. తమకంటే చిన్న జీవుల్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటాయవి.
పైగా, పాములన్నీ విషపూరితం కాదు. వందల సంఖ్యలో పాము జాతులు వుంటే, అందులో పదుల సంఖ్యలో కూడా విషపూరితమైనవి వుండవు.