Zohran Mamdani New York Mayor.. సన్నీ లియోన్ తెలుసు కదా.? భారతీయ మూలాలున్న కెనడియన్ భామ.! అడల్ట్ కంటెంట్‌తో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ పెంచుకుంది.!
అనూహ్యంగా, ఆ ‘అడల్ట్ కంటెంట్’కి గుడ్ బై చెప్పేసి, ఇండియాకి వచ్చేసి.. బాలీవుడ్ సినిమాల దగ్గర్నుంచి, టాలీవుడ్ సినిమాల్లోనూ నటించేసింది.
సన్నీలియోన్, బాలీవుడ్లో అడుగు పెట్టడంపై అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. తమ కాపురాలు కూలిపోతాయంటూ పలువురు సినీ ప్రముఖుల ఇళ్ళల్లోని మహిళలు ఆమెకు వ్యతిరేకంగా నినదించారు.
‘నేనూ భారతీయురాలినే..’ అంటూ, సన్నీలియోన్ ఓ బాలికని ఇక్కడే, మన దేశంలోనే దత్తత తీసుకుంది. ఆ తర్వాత, ఇద్దరు కవలలకు సరోగసీ విధానంలో తల్లయ్యింది సన్నీలియోన్. కట్ చేస్తే,
సన్నీలియోన్ ప్రాపర్టీస్ అన్నీ విదేశాల్లోనే వున్నాయ్. అప్పుడప్పుడూ, ఇండియాకి వచ్చి పోతుంటుంది. ఇక్కడ వుండడానికి అనువుగా ఓ ఫ్లాట్ కొనుగోలు చేసిందంతే.
Zohran Mamdani New York Mayor.. మనోళ్ళే.! అనడమే, ఓ బ్యాడ్ హ్యాబిట్.!
ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు.? అంటే, ‘మన’ అని కలిపేసుకోవడం.. మనకో బ్యాడ్ హ్యాబిట్.!
అమెరికా అధ్యక్ష రేసులో గతంలో పోటీ పడిన, మాజీ వైస్ ప్రెసిడెంట్ కమల హారిస్, మనమ్మాయేనని చెప్పేసుకున్నాం కదా.!
ఇప్పుడు తాజాగా, జోహ్రాన్ మమ్దానీ అనే భారతీయ మూలాలున్న వ్యక్తి, న్యూయార్క్ నగర మేయర్‌గా ఎన్నికయ్యాడు. ‘మనోడే’ అంటూ, అప్పుడే, భజన షురూ అయ్యింది.
ఎవరీ జోహ్రాన్ మమ్దానీ.. అంటూ, బీరకాయ పీచు లింకుల్ని లాగేస్తున్నారు. అతనెవరో కాదు, బాలీవుడ్ సినీ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడట.!
అంటే, మరీ బీరకాయ పీచు బంధుత్వమేమీ కాదు.. మన మీరా నాయర్ కొడుకే.! కానీ, పుట్టింది మాత్రం భారత దేశంలో కాదు. మీరా నాయర్, పంజాబీ హిందూ.!
గుజరాతీ ముస్లిం మహ్మద్ మమ్దానీని మీరా నాయర్ పెళ్ళాడారు. జోహ్రాన్ మమ్దానీ జన్మించింది ఉగాండాలో.
జోహ్రాన్‌కి ఐదేళ్ళ వయసొచ్చాక మహ్మద్ మమ్దానీ కుటుంబం, దక్షిణాఫ్రియాలోని కేప్‌టౌన్‌కి మకాం మార్చిందట. రెండేళ్ళలోనే అక్కడి నుంచి న్యూయార్క్ వచ్చి,
న్యూయార్క్‌లోనే మమ్దానీ కుటుంబం స్థిరపడింది. తండ్రి నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్నాడు జోహ్రాన్ మమ్దానీ.!
Also Read: బుర్రలు బద్దలాసుపోయే ప్రశ్న: అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంత.?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, న్యూయార్క్ మేయర్ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. జోఫ్రాన్ ఘన విజయాన్ని అడ్డుకోలేకపోయారు.
2020లోనే న్యూయార్క్ అసెంబ్లీలో అడుగు పెట్టారు జోఫ్రాన్ మమ్దానీ.!
మొన్న కమలా హేరిస్, ఇప్పుడు జోఫ్రాన్ మమ్దానీ.. చెప్పుకుంటూ పోతే, భారతీయ మూలాలున్న వ్యక్తులు, అమెరికా రాజకీయాలపై తమదైన ముద్ర వేయడం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది.
ఎంత పెరిగినా, అమెరికా ఈజ్ డిఫరెంట్.! అక్కడ ఎవరైనాసరే, ‘అమెరికా ఫస్ట్’ అనాల్సిందే. బీరకాయ పీచు సంబంధాల వల్ల, అమెరికా నుంచి భారత దేశానికి అదనపు ప్రయోజనమేమీ వుండదు.
