Home » గ్లా‘మైరా’: మినిమమ్ స్టైలింగ్.. మ్యాగ్జిమమ్ ఎట్రాక్షన్.!

గ్లా‘మైరా’: మినిమమ్ స్టైలింగ్.. మ్యాగ్జిమమ్ ఎట్రాక్షన్.!

by Mudra369 Editorial Desk
0 comments
Amyra Dastur

Amyra Dastur Fashion Icon.. ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్ సెట్ చేయడంలో అందాల భామ అమైరా దస్తూర్ ఎప్పుడూ ముందుంటుంది.

తన స్టైల్ అండ్ గ్లామర్‌తో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ తనదైన అభినయంతో ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తుంటుంది అమైరా దస్తూర్.

సినిమాల సంగతెలా వున్నా సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఫోటో షూట్లతో నెటిజన్ల మనసుల్ని దోచుకునే ఈ ముద్దుగుమ్మ తాజాగా నెట్టింట పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయ్.

బ్లాక్ అండ్ వైట్ ప్యాటర్న్‌లో క్లాసీ మోనోక్రోమ్ వైబ్ క్రియేట్ చేస్తోంది ఈ లేటెస్ట్ పోజులతో అమైరా దస్తూర్.

Amyra Dastur Fashion Icon.. మినిమల్ స్టైలింగ్ మ్యాగ్జిమమ్ ఎట్రాక్షన్.!

బ్లాక్ కలర్ డిజైనర్ క్రాప్ టాప్ ధరించి, దానికి కాంబినేషన్ వర్టికల్ స్ట్రైప్స్ హై వేస్టెడ్ ప్యాంట్ సూపర్బ్ కాంబోలా కనిపిస్తోంది.

అలాగే హై నెక్ బ్లాక్ టాప్, ఫుల్ స్లీవ్ డిజైన్.. ఆ నడుము దగ్గర వచ్చిన కట్ క్లాసీ లుక్‌తో పాటూ ట్రెండీ వైబ్స్ యాడ్ చేస్తోంది.

Amyra Dastur
Amyra Dastur

ఇక, ఈ కాస్ట్యూమ్‌కి మ్యాచింగ్ లైన్‌లో వ్యాక్ గ్రౌండ్ వాల్ డిజైన్ కేక పుట్టిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ డైమండ్ వాల్ డిజైన్ అమైరా దస్తూర్ ఫోటో పోజుల్ని చాలా ఆర్టిస్టిక్‌గా మార్చేశాయ్.

సింపుల్ మేకప్, అండ్ స్ట్రైట్ పోనీ టెయిల్ హెయిర్ స్టైల్ తనదైన ఆటిట్యూడ్‌ని రెట్టింపు చేస్తోంది.

నడుం మీద చేయి వేసుకుని ఎంతో కాన్ఫిడెంట్‌గా నిలబడిన తీరు, అమైరాలోని స్టైలింగ్ సెన్స్‌ని మరింత ఆకర్షణీయంగా మార్చేసింది.

మనసుకు నచ్చేసింది.!

తెలుగులో ‘మనసుకు నచ్చింది’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. చేసినవి తక్కువ సినిమాలే కానీ, తెలుగు ప్రేక్షకుల మనసుల్ని తనదైన అందం, స్టైలింగ్‌తో కట్టి పడేసింది.

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటూ కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ అమైరా దస్తూర్ బిజీగా వుంది. వాటిలో కొన్ని వెబ్ సిరీస్‌లు ఈ మధ్య ఓటీటీలో సందడి చేస్తున్నాయ్.

Also Read: సెల్ఫీ ప్రేమ.! అందాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతుందా.?

తెలుగులో (‘మనసుకు నచ్చింది’ తొలి సినిమా) అమైరా చేసిన సినిమాలు చాలా తక్కువే కానీ, తన స్టైలింగ్ అండ్ బ్యూటీతో తెలుగు ఆడియన్స్‌లో చెరగని ముద్ర వేసుకుంది.

ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా వుంది. అలాగే బాలీవుడ్ వెబ్ సిరీస్‌ల్లోనూ అమైరా కనిపిస్తోంది. ఓటీటీలో అమైరా నటించిన ఆయా వెబ్ సిరీస్‌లు అందుబాటులో వున్నాయ్.

లేటెస్ట్‌గా అమైరా దస్తూర్ ‘చుంబక్’ అనే ఫ్యామిలీ వెబ్ సిరీస్‌లో నటించింది.

అమైరా నటించిన పాత్ర చాలా ఫన్నీగా క్యూట్‌గా వుండడం మరియు తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులో వుండడంతో, తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group