Home » చిరంజీవి ఆగ్రహం: రక్తాన్ని అమ్ముకోవాల్సిన ఖర్మ నాకేంటి.?

చిరంజీవి ఆగ్రహం: రక్తాన్ని అమ్ముకోవాల్సిన ఖర్మ నాకేంటి.?

by Mudra369 Editorial Desk
0 comments
Mega Star Chiranjeevi Political

Chiranjeevi Slams Bloody Rumors.. మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పగానే, సినిమాల్లో ఆయన చేసిన డాన్సులే కాదు.. నిజ జీవితంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కూడా గుర్తుకొస్తాయ్ ఎవరికైనా.!

చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ ద్వారా ఇటు ఆపదలో వున్నవారికి రక్తాన్ని అందించడంతోపాటు, అటు అవసరమైనవారికి నేత్రాల్ని అందించేలా చేస్తున్నారు.

కోట్లాదిమంది అభిమానులున్నారు మెగాస్టార్ చిరంజీవికి. నిత్యం, చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ ద్వారా రక్తాన్ని సేకరిస్తుంటారు. ఈ మేరకు అభిమానులు, రక్తదానానికి ముందుకొస్తుంటారు.

అయితే, మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడాన్ని సహించలేక, కొంతమంది రాజకీయ నాయకులు ‘చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్’ మీద తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారు గతంలో.

ఇప్పటికీ కొందరు, ఆ తరహా రాజకీయ విమర్శలు చిరంజీవి మీద చేస్తూనే వుంటారు.. చిరంజీవి రాజకీయాల్లో లేకపోయినాసరే.

Chiranjeevi Slams Bloody Rumors.. సేవా కార్యక్రమాల్లో చిరంజీవికి సాటెవ్వరు.?

ఆదాయపు పన్ను విషయంలో చిరంజీవి ఎంత నిక్కచ్చిగా వుంటారో, ‘చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్’ నిర్వహణ వ్యవహారాల్లోనూ అంతే నిక్కచ్చిగా వుంటారాయన.

కోవిడ్ కష్ట కాలంలో చిరంజీవి, ఆక్సిజన్ బ్యాంకుల్ని సైతం ఏర్పాటు చేసి, ఎన్నో ప్రాణాల్ని కాపాడారు ఆ ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా.

ఇక, తాజాగా చిరంజీవి తన అభిమానులతో ముచ్చటిస్తూ, కష్టాల్ని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో చెప్పారు. తన జీవితంలో ఎదురైన కష్టాల గురించీ, వాటిని అధిగమించిన తీరు గురించీ వివరించారు.

ఈ క్రమంలోనే, ‘చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్’ మీద వచ్చిన ఆరోపణలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆగ్రహమూ వ్యక్తం చేశారు.

‘కోట్లాది రూపాయల రెమ్యునరేషన్‌ని సినీ నటుడిగా తీసుకునే నేను, ఎన్ని కోట్ల బ్లడ్ ప్యాకెట్లు అమ్ముకోవాలి అంత సంపాదించాలంటే.. అంత ఖర్మ నాకెందుకు.?’ అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు.

రోజా, జీవిత.. రాజకీయ విమర్శలు..

సినీ నటీమణులు జీవిత, రోజా.. తదితరులు చిరంజీవి మీద గతంలో రాజకీయ కోణంలో ఆరోపణలు చేస్తూ, ‘చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్’ని వివాదాల్లోకి నెట్టే ప్రయత్నం చేశారు.

అయితే, ఆ తర్వాత అవన్నీ రాజకీయ విమర్శలు మాత్రమేననీ, చిరంజీవి మీద వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదనీ, చిరంజీవి సేవా కార్యక్రమాలు చాలా గొప్పవని పలు సందర్భాల్లో జీవిత, రోజా చెప్పడం విన్నాం.

ఏదిఏమైనా, చిరంజీవి మీద విమర్శలు చేస్తే తమ పాపులారిటీ పెరుగుతుందనే కక్కుర్తితో కొందరు ‘చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్’నే సాఫ్ట్ టార్గెట్‌గా ఎంచుకోవడం పరిపాటిగా మారిపోయింది.

రాజకీయాల్లో చిరంజీవి, తిరుపతి ఎమ్మెల్యేగా సేవలందించారు. రాజ్య సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు మెగాస్టార్ చిరంజీవి.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group