The Paradise First Review.. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ విడుదలకు సిద్ధమైంది. కయాదు లోహర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది నేచురల్ స్టార్ నాని సరసన.
సీనియర్ నటుడు మోహన్ బాబు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా చూశాక, తన దగ్గరకు రావడానికే భయపడతారంటూ సినిమాలో తన పాత్ర గురించి మోహన్‌బాబు తనదైన స్టయిల్లో చెప్పారు.
ఇక, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తాను కష్టపడటంతోపాటు, నటీనటుల్ని అలానే సాంకేతిక నిపుణుల్ని ఎలా ఈ సినిమా కోసం కష్టపెట్టాడో ఒకరొకరుగా మీడియా ముందుకొచ్చి చెబుతూనే వున్నారు.
ఇంత ఇష్టమైన కష్టాన్ని అనుభవించింది, సినిమాని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దడానికేనన్నది దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వాదన.
మరోపక్క, సినిమాలోని కొన్ని సన్నివేశాల్ని పలు దశల్లో చూసినవాళ్ళంతా, దీన్నొక వెండితెర అద్భుతం.. అని కొనియాడుతున్నారు.
The Paradise First Review.. ట్రైలర్ రిలీజ్ చేయకపోయినా..
విడుదల డేట్ దగ్గర పడేవరకూ సినిమాకి సంబంధించిన వర్క్ జరుగుతూనే వుంది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేయడాన్ని కూడా పక్కన పెట్టేసింది ‘ది ప్యారడైజ్’ టీమ్.
అటు దర్శకుడు, ఇటు సంగీత దర్శకుడు.. ఎడిటింగ్ టీమ్‌తో కలిసి కూర్చుని, పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే, సినిమా చాలా చాలా బాగా వచ్చిందనే టాక్, ఎడిటింగ్ టేబుల్ దగ్గర నుంచి బయటకు వస్తోంది.
‘ఫస్ట్ రివ్యూ’ అని, ఇలాంటి సమాచారాన్ని బట్టే చెబుతుంటాం కదా.! ఆ లెక్కన, ఫస్ట్ రివ్యూ అయితే అదిరిపోయింది. ఇదే టాక్ గనుక, ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’కి వినిపిస్తే, నాని కొట్టబోయే హిట్టు.. ఓ రేంజ్‌లో వుండబోతోంది.
ఆల్రెడీ, ఓవర్సీస్‌లో సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. అడ్వాన్స్ బుకింగ్స్ బీభత్సంగా జరుగుతున్నాయి. తెగుతున్న టిక్కెట్లు, సినిమాపై అంచనాల్ని మరింత పెంచేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ల ధరలపై పెంపు ‘స్వల్పంగానే’ వుంది గనుక, ఫస్ట్ డే వసూళ్ళ జాతరని చూడొచ్చన్నది ట్రేడ్ వర్గాల అంచనా.
వసూళ్ళ పంట పండుతుందా..
ఈ వారం మరో సినిమా ఏదీ ‘ది ప్యారడైజ్’కి పోటీగా లేకపోవడం కలిసొచ్చే అంశం. ‘ఇరుముడి’ తర్వాత, ఆ స్థాయి.. అంతకు మించిన విజయం ‘ది ప్యారడైజ్’ అందుకోవాలని పరిశ్రమ వర్గాలూ ఆశిస్తున్నాయి.
‘జడల్’ పాత్రలో నాని, ఆ పాత్ర కోసం నాని పెంచిన జుట్టు, దానికి అదనంగా జోడించిన భారీ విగ్గు.. ఈ కష్టాల గురించి టీమ్ చెబుతున్న విషయాల్ని తెలుసుకుంటూనే వున్నాం.
ఎంత కష్టపడ్డా సరే, ఆ కష్టమంతా ఇప్పుడు మర్చిపోయామని నాని చెబుతున్నాడు. వేలాది మంది అభిమానులతో నాని ‘ది ప్యారడైజ్’ విడుదలకు కొద్ది రోజుల ముందు ముచ్చటించిన సంగతి తెలిసిందే.
Also Read: నేనలాంటిదాన్ని కాదు.! నన్ను ట్రోల్ చెయ్యొద్దు.!
అన్నట్టు, సినిమా ప్రమోషన్స్‌కి కాస్త ఆలస్యంగా వచ్చింది కయాదు లోహర్. లేట్ అయితేనేం, ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో కయాదు లోహార్ క్యూట్‌నెస్ ఆకట్టుకుంటోంది.
మొత్తమ్మీద, సూపర్ హిట్ ప్రీ రిలీజ్ టాక్‌తో విడుదలకు సిద్ధమైన ‘ది ప్యారడైజ్’, అంచనాలకు మించిన విజయాన్ని అందుకోవాలని ఆశిద్దాం.
