Ananya Panday Beautiful Lehenga.. చక్కనమ్మ ఏం చేసినా అందమే.. అంటాడో కవి.! అంతే మరి.. ఆ చక్కదనం అలాంటిది కదా.!
ఆ సంగతి పక్కన పెడితే, అందరిలోకీ ప్రత్యేకంగా కనిపించాలంటే, ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలో అవ్వాల్సిందేనని అంటుంటారు అందాల భామలు.
మీరేనా.? మేం కూడా.. అని పురుష పుంగవులు కూడా, ఫ్యాషన్ ట్రెండ్స్ విషయంలో అస్సలేమాత్రం తగ్గేదేలే.. అంటుండడమూ చూస్తున్నాం.!
ఫొటోలో వున్నదెవరో తెలుసు కదా.? బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే.! ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలో అవడంలో తనకు తానే సాటి.. అనిపించుకుంటుంటుంది.
మోడ్రన్ డ్రెస్సుల్లో అయినా, సంప్రదాయ చీరకట్టులో అయినా పెర్‌ఫెక్ట్‌గా సూట్ అయిపోతుంది అనన్య పాండే.!
తెలుగులో అనన్య పాండే, ‘లైగర్’ సినిమా కోసం విజయ్ దేవరకొండతో జత కట్టిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా ఇది.
Ananya Panday Beautiful Lehenga.. లెహెంగా.. ట్రెండింగ్ టాపిక్..
ఇక, అనన్య పాండే తాజా ఫొటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు ఇంతలా హాట్ టాపిక్ అవ్వడానికి ఓ బలమైన కారణం కూడా వుంది.
అదేంటంటే, అనన్య పాండే ధరించిన ‘లెహెంగా’ ఏకంగా, లక్ష రూపాయల విలువ చేస్తుందిట. సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ భూమిక శర్మ ఈ లెహెంగాని రూపొందించడం గమనార్హం.
Also Read: స్నేక్ బ్యూటీ.! టచ్ చేస్తే, కాటేస్తది జాగ్రత్త.!
కానీ, లక్ష అంటే.. మరీ ఎక్కువేం కాదు.. అంతకు మించిన ఖర్చుతో ‘లెహెంగా’లు రూపొందిస్తుంటారు ప్రముఖ డిజైనర్లు. అంటే, ఇది ఆ లిస్టులో ‘బడ్జెట్ లెహెంగా’ అనుకోవచ్చు.
ఏదైతేనేం, అనన్య పాండే ఈ లెహెంగాలో మరింత అందంగా కనిపిస్తోంది.! లెహెంగా కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఫ్యాబ్రిక్స్ వాడారట.!
