Home » ‘ఆదర్శ కుటుంబం’ రివ్యూ: త్రివిక్రమ్ ‘మార్కు’ ఎక్కడ.?

‘ఆదర్శ కుటుంబం’ రివ్యూ: త్రివిక్రమ్ ‘మార్కు’ ఎక్కడ.?

by Mudra369 Editorial Desk
0 comments
Aadarsha Kutumbam Review

Aadarsha Kutumbam Review.. తెలుగు సినీ పరిశ్రమలో ‘గురువుగారు’ అనే గౌరవం, దర్శక రత్న దాసరి నారాయణరావుకి దక్కింది.

‘గురూజీ’ అనే గౌరవం దక్కించుకున్నది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే. త్రివిక్రమ్ సినిమాలు, మిగతా సినిమాలతో పోల్చితే చాలా భిన్నంగా వుంటాయి.

ఓ సాధారణ సన్నివేశాన్ని చాలా బలంగా చెప్పలగడు. మాటలతో మ్యాజిక్ చేస్తాడు.. ఇవన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రత్యేకతలు.

కానీ, గత కొంతకాలంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కలం పదును బాగా తగ్గిపోయింది. ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్.! ‘అల వైకుంఠపుములో’ సినిమా హిట్టయినా, త్రివిక్రమ్ స్థాయి సినిమా కాదు.

మరి, త్రివిక్రమ్ శ్రీనివాస్ – విక్టరీ వెంకటేష్ కలిస్తే, ఆ కాంబినేషన్ ఎలా వుండాలి.? ఎలా వుంది.? తెలుసుకుందాం పదండిక.!

Aadarsha Kutumbam Review.. కథలోకి వెళితే..

ఓ సాధారణ కుటుంబం.. అనుకోకుండా లాటరీలో వంద కోట్లు తగులుతుంది. ఆ సొమ్ముల్ని కొట్టేయడానికి ఓ గ్యాంగ్ ప్రయత్నిస్తుంటుంది. ఆ కుటుంబం ఆ గండం నుంచి ఎలా గట్టెక్కిందన్నది అసలు కథ.

కథ ఇంతేనా.? ఔను, ఇంతే.! ‘బ్లాస్ట్’ సినిమాకి కాపీ అనీ, మరో సినిమాకి ఫ్రీమేక్ అనీ.. ‘ఆదర్శ కుటుంబం’ సినిమా రిలీజ్‌కి ముందు చాలా గాసిప్పులు విన్నాం.

వాటిల్లో కొంత నిజం లేకపోలేదు. అలాగని, పూర్తిగా నిజం కాదు కూడా.! చాలా సన్నివేశాలు, ఇంతకు ముందు ఏదో సినిమాలో చూసేశాం కదా.. అన్న భావనని కలగజేస్తాయి.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, తన వరకు తాను ఏదో కొత్తగా ట్రై చేద్దామనుకున్నాడుగానీ, పరమ రొటీన్ వ్యవహారమే.. సినిమా అంతా.!

మాటల మాంత్రికుడి మాయాజాలం కొన్ని డైలాగుల వరకే పరిమితమైంది. కామెడీ పాళ్ళు తగ్గాయ్. యాక్షన్ పాళ్ళు పెరిగాయ్.!

నవ్వులు అంతంతమాత్రమే..

వెంకటేష్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే, నవ్వులెలా వుండాలి.? కథనమెంత గ్రిప్పింగ్‌గా వుండాలి.? ప్చ్.. అవేవీ లేవు.

సినిమా అద్భుతంగా లేదు.. అలాగని, మరీ నీరసంగానూ లేదు. ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేస్తుంది. అక్కడి వరకూ ఢోకా లేదు.

ఫస్టాఫ్ పూర్తయ్యేసరికి, సూపర్ హిట్టు బొమ్మ.. అనే కళ కనిపిస్తుంది. సెకెండాఫ్ మళ్ళీ పరమ రొటీన్ వ్యవహారమే. రిలీజ్ విషయంలో ‘వాయిదా’ కాస్త కలిసొచ్చినట్లుంది ఫైన్ ట్యూన్ చేసుకోవడానికి.

ట్యూన్ అంటే గుర్తుకొచ్చింది.. పాటల పరంగా, తమన్ ఏమీ పెద్దగా మ్యాజిక్ చేయలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బానే వుందిగానీ.. అలవాటైపోయిన సౌండ్లే.!

చాలా సీన్స్, ఈ అలవాటైపోయిన సౌండ్స్‌తోనే బాగా ఎలివేట్ అయ్యాయి. అదొక ప్లస్ పాయింట్. కొంచెం ప్యాటర్న్ మార్చుకోకపోతే, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా బోర్ కొట్టేస్తుంది ముందు ముందు.

ఎడిటింగ్ కోణంలో చూస్తే, చాలా సన్నివేశాల నిడివిని ఈజీగా తగ్గించెయ్యొచ్చు. ‘మాలా’ సాంగ్ థియేటర్లకి రాలేదు. సత్య కామెడీ చాలా పెద్ద రిలీఫ్.

తనకు టైలర్ మేడ్ అయిన ఇలాంటి పాత్రల్లో వెంకీ చెలరేగిపోతాడు మామూలుగా అయితే, ఇక్కడా ‘చిట్టిబాబు’ పాత్రలో చాలా ఈజ్‌తో చేసుకుపోయాడుగానీ.. ఇంకా బాగా డిజైన్ చేసి వుండొచ్చు ఆ పాత్రని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

శ్రీనిధి శెట్టి పాత్రని కూడా ఇంకా బాగా రాసుకుని వుండొచ్చు. మరింత స్కోప్ ఆమెకు దక్కి వుంటే బావుండేది. నివేదా పేతురాజ్ మంచి నటి. కానీ, గెస్ట్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ వరకే పరమితమవుతోంది.

మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రల పరిధి మేర ‘మమ’ అనిపించేశారంతే. నిర్మాణపు విలువల గురించి మాట్లాడుకోవాలంటే, సినిమా రిచ్‌గానే తెరకెక్కింది.

గురూజీ.. మార్క్ సినిమా కాదిది..

ఫైనల్ టచ్ ఏంటంటే.. త్రివిక్రమ్ నుంచి అతన్ని ‘గురూజీ’ అని భావించే అభిమానులు ఆశించే సినిమా కాదిది. కాకపోతే, ఫ్యామిలీ ఆడియన్స్, ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి.

దసరా సీజన్‌ని ‘ఆదర్శ కుటుంబం’ మిస్సయ్యింది. అక్టోబర్ మొదటి వారంలోనే సినిమా రిలీజ్ అయి వుంటే, వసూళ్ళ పంట ఖచ్చితంగా పండి వుండేది.

ఫ్యామిలీ ఆడియన్స్ ఎంత బాగా సినిమాకి కనెక్ట్ అయితే, అంత రేంజ్ వసూళ్ళు ‘ఆదర్శ కుటుంబం’కి వస్తాయ్.!

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం, తన నుంచి తన అభిమానులు చాలా ఎక్కువ ఆశిస్తున్నారన్న విషయాన్ని గుర్తెరిగి, తదుపరి సినిమాలకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే.. ప్లాన్ చేసుకుంటే మంచిది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group