Radhika Apte White Skin.. దక్షిణాది సినిమాల్లో ఉత్తరాది హీరోయిన్లు ఎందుకు ఎక్కువగా అవకాశాలు దక్కించుకుంటారు.? ఎందుకంటే, వాళ్ళకి ‘తెల్ల తోలు’ వుంటుంది గనుక.!
ఔనేమో.! మిల్కీ బ్యూటీ తమన్నా తెలుసు కదా.! తమన్నా భాటియా.. తెల్లగా వుంటుంది.. కాబట్టే, ఆమెకి దక్షిణాది సినిమాల్లో అవకాశాలు వచ్చిపడ్డాయన్నమాట.!
అందాల చందమామ కాజల్ అగర్వాల్ విషయంలోనూ అంతే.! మరో హీరోయిన్ కూడా తెల్ల తోలు వల్లనే దక్షిణాది సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుందని అర్థం చేసుకోవాలి మని.!
సరేగానీ, సౌత్ బ్యూటీస్ కూడా బాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు కదా.? అంటే, బాలీవుడ్ జనాలు నల్ల తోలుని ఇష్టపడతారేమో.!
Radhika Apte White Skin.. అసలీ తెల్లతోలు గోలేంటి.?
అసలు, ఈ తెల్ల తోలు.. నల్ల తోలు.. గోలేంటి.? నటి రాధికా ఆప్టే అంటే, వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్. ఇదో పబ్లిసిటీ స్టంట్ ఆమెకి.!
దక్షిణాదిలో ఎంతోమంది అందగత్తెలున్నారు.. భాష తెలిసిన వాళ్ళు కూడా వున్నారు.. వాళ్ళని కాకుండా, తెల్ల తోలు వుందన్న కారణంగానే, మాలాంటి వాళ్ళకు అవకాశాలిస్తున్నారంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సెలవిచ్చింది రాధిక ఆప్టే.
పక్కనే, కీర్తి సురేష్ కూడా వుంది. కీర్తి సురేష్ మన సౌత్ బ్యూటీ.! ‘ఔను, రాధిక చెప్పింది నిజమే..’ అన్నట్లుగా కీర్తి సురేష్ తలాడించింది, రాధిక ఆప్టే వ్యాఖ్యలకి. ఇదింకా ఆశ్చర్యకరం.
తెల్ల తోలు కారణంగా సినిమాల్లో హీరోయిన్లకు ఛాన్సులివ్వడం జరగదు.! సినిమాకి గ్లామర్ అవసరం.! మోడ్రన్ టచ్ కూడా అవసరం.. కొన్ని సినిమాలకి.
హీరోయిన్.. అంటే, గ్లామరస్‌గానే వుండాలా.?
హీరో – హీరోయిన్.. ఈ కాంబినేషన్ కోసం రచయిత, ఓ కథ సిద్ధం చేస్తాడు. పాత్రల్ని ఆ రచయిత, తనకు నచ్చినట్లు రాసుకుంటాడు.. దానికి కమర్షియల్ హంగులూ అద్దుతారు.
దక్షిణాది తారలు కొంతమంది ఆ పాత్రలకు సూట్ అవరేమో.. అన్న కోణంలో, డిఫరెంట్ లుక్ కోసం బాలీవుడ్ నుంచి తారల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంటారు.
అన్ని సినిమాల విషయంలోనూ ఇలా జరగదు కదా.! దక్షిణాదిలోనూ హీరోయిన్లు స్టార్లుగా ఎదిగారు. నయనతారకి, వున్న డిమాండ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
త్రిష కూడా బాలీవుడ్ సినిమాలు చేసింది. ఆ మాటకొస్తే, బెంగళూరు భామలు.. బాలీవుడ్‌లో అగ్ర నటీమణులుగా చెలామణీ అయ్యారు.. హాలీవుడ్ స్థాయికీ వెళ్ళారు.
మలయాళ బ్యాక్‌గ్రౌండ్ వున్న నటీమణులూ బాలీవుడ్‌లో స్టార్లయ్యారు. ఇవన్నీ రాధికా ఆప్టేకి తెలియదా.? అంటే, తెలిసీ.. వివాదాన్ని రాజేసిందంతే.!