Rakul Preet Singh Bikini Beauty.. మాల్దీవులంటేనే, సముద్ర తీర అందాలకి కేరాఫ్ అడ్రస్.! అక్కడ సేద తీరడమంటే సెలబ్రిటీలకు అదో కిక్కు.!
ఆ మధ్య మాల్దీవులకు వెళ్ళడంపై కొందరు సెలబ్రిటీలు తమంతట తాముగా ‘సెల్ఫ్ బ్యాన్’ విధించుకున్నారు.. దానిక్కారణాలు వేరే వున్నాయ్.
ఆ తర్వాత మళ్ళీ ఆ బ్యాన్‌ని సెలబ్రిటీలు తమంతట తామే తొలగించేసుకున్నారు.. మాల్దీవుల్లో వెకేషన్ పేరుతో, గ్లామరస్ మంట పెట్టేస్తున్నారు కూడా.!

లోతు తక్కువగా వుండే సముద్ర తీరంలో, ప్రత్యేకంగా నిర్మించిన స్టార్ హోటల్ తరహా సౌకర్యాలతో నిర్మించిన సూట్ రూమ్స్.. అక్కడ సేద తీరితే ఆ కిక్కే వేరప్పా.!
చూస్తున్నారుగా.. హాట్ సెన్సేషన్ రకుల్ ప్రీత్ సింగ్.. ఎలా ఎంజాయ్ చేస్తోందో.!
స్విమ్మింగ్ పూల్‌లోకి చీర కట్టుకుని దిగలేం కదా.? అని ఓ హీరోయిన్ అప్పట్లో గడుసుగా సమాధానమిచ్చిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. చక్కనమ్మ ఏం చెప్పినా అందమే.!

అలాగే, చక్కనమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఏం చూపించినా.. అందమే.! పెళ్ళయ్యింది కదా.. నీకిదేం పోయేకాలం.? అని ప్రశ్నించే నెటిజనం మామూలే.. అదెప్పుడూ వుంటూనే వుంటుంది.
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే.. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన రకుల్, ఇన్నేళ్ళుగా పెర్‌ఫెక్ట్ ఫిజిక్‌ని ఎలా మెయిన్‌టెయిన్ చేస్తోందో ఏమో కదా.!
ఆ విషయంలో రకుల్ ప్రీత్ సింగ్‌ని అభినందించి తీరాలి.! అందుకే, చక్కనమ్మ చీర కట్టినా అందమే.. బికినీ అందాలు చూపించినా అందమేనని.!
