Mrunal Thakur Gossip Again.. సాధారణంగా వివాదాలకు చాలా దూరంగా వుంటూ వస్తుంది మృణాల్ ఠాకూర్. తన సినిమాలేవో తాను చక్కగా చూసుకుంటూ, చేసుకుంటూ వెళ్ళిపోతుందంతే.
వచ్చిన అవకాశాల్లో, తనకు నచ్చిన సబ్జెక్టుల్ని మాత్రమే ఎంచుకోవడం మృణాల్ ఠాకూర్ ప్రత్యేకత. సినిమా హిట్టయినా, ఫట్టయినా, మృణాల్ ఠాకూర్ మాత్రం మంచి పేరు తెచ్చుకుంటోంది.
కానీ, తరచూ ఎఫైర్స్.. అంటూ, ఈ మధ్య మృణాల్ ఠాకూర్ పేరు వార్తల్లోకెక్కుతోంది. ఏ సినిమాలో నటిస్తే, ఆ సినిమా హీరోతో హీరోయిన్లకు ఎఫైర్లు అంటగట్టేసి, పుకార్లు పుట్టించడం మామూలే.
అయితే, గత కొన్నాళ్ళుగా మృణాల్ ఠాకూర్ మీద గాసిప్స్ ఒకింత ఘాటుగా వినిపిస్తున్నాయి. మొన్నామధ్య తమిళ హీరో ధనుష్, ఆ తర్వాత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్.. ఇలా చాలానే వున్నాయ్.
తాజాగా, యంగ్ క్రికెటర్ యశశ్వి జైస్వాల్ పేరుని మృణాల్ ఠాకూర్‌తో ముడిపెడుతూ, ‘ఎఫైర్స్ గాసిప్స్’ సృష్టించేసింది బాలీవుడ్ మీడియా.
విషయమేంటంటే, ఓ రెస్టారెంట్‌లో ఈ ఇద్దరూ కలిసి కనిపించారు. కలిసి.. అంటూ, బయటకు వచ్చేస్తున్నప్పుడన్నమాట. వేర్వేరు సందర్భాల్లో ఇద్దరూ అందులోకి ఎంటరయ్యారు.
కానీ, కలిసి బయటకు వచ్చార.. కలిసి అంటే, నిజంగా కలిసి కాదు.. విడివిడిగా. అంతే, ఒకే రెస్టారెంటులో ఒకేసారి కనిపించిన యశశ్వి, మృణాల్.. అంటూ పుకార్లు షురూ అయ్యాయ్. అదీ సంగతి.
గ్లామర్ వున్న చోట గాసిప్ వుంటుంది. అదంతే.! కొన్ని గాసిప్స్ ఫన్నీగా వుంటాయ్.. అని పలు సందర్భాల్లో ఇలాంటి గాసిప్పుల గురించే మృణాల్ ఠాకూర్ సరదాగా చెబుతూ వచ్చింది.
ఇంతకీ, ఈసారి వినిపించిన ఈ ఘాటైన గాసిప్ విషయమై మృణాల్ ఠాకూర్ ఏమంటుందో.! నిప్పు లేకుండా పొగ రాదన్నది పాత సామెత.. గాసిప్స్ విషయంలో పొగకి, నిప్పుతో పని లేదు.!
