Malaika Arora Dating Again.. బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా మళ్ళీ డేటింగ్‌లో బిజీబిజీగా వుందట.!
అదేంటీ, ఆ మధ్య బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌తో చాన్నాళ్ళు డేటింగ్ చేసింది కదా.? అంటే, అది వేరే కథ.
ఈసారి ఇంకో కొత్త కథ.! అయితే, ఈసారి కూడా ఓ కుర్రాడితోనే డేటింగులో బిజీగా వుందిట. మలైకా అరోరా కంటే, దాదాపు 20 ఏళ్ళ చిన్నవాడైన ఓ యవకుడితో మలైకా అరోరా డేటింగ్ చేస్తోందిట.
ఇంతకీ, ఎవరా అబ్బాయి.? అంటే, ఆ విషయం సంగతి పక్కన పెడితే, తనకంటే చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో మలైకా అరోరా డేటింగ్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్.
మలైకా అరోరాకి ఓ కొడుకున్నాడు.! ఆ కొడుకు వయసున్న కుర్రాడితోనే మలైకా ఇప్పుడు డేటింగ్‌లో వుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
మామూలుగా అయితే, మలైకా అరోరా ఇలాంటి గాసిప్స్‌కి అవకాశమే ఇవ్వదు. ఏదున్న, ఓపెన్‌గానే చెప్పేస్తుంటుంది. అర్జున్ కపూర్‌తో డేటింగ్ విషయాన్ని స్వయంగా మలైకానే స్పష్టం చేసేసింది అప్పట్లో.
మలైకా, అర్జున్.. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకు తిరిగేవారు. ఓ దశలో వీరిద్దరి పెళ్ళి గురించిన ప్రచారాలూ గట్టిగానే జరిగాయి. అయితే, పెళ్ళి పీటలెక్కలేదు మలైకా, అర్జున్.
తాజా డేటింగ్ హీరో ఎవరు.? అంటే, అతనో వ్యాపారి. అతనెవరో కాదు, డైమండ్ వ్యాపారి హర్ష్ మెహతా. బాలీవుడ్‌తో హర్ష్ మెహతాకి హాట్ హాట్ కనెక్షన్లు వున్నాయి.
తాజాగా, ఓ ఫంక్షన్‌లో మలైకా, హర్ష్ మెహతా చెట్టాపట్టాలేసుకు తిరగడం చర్చనీయాంశమవుతోంది. అయితే, ఈ రూమర్లపై ప్రస్తుతానికి మలైకా అరోరా స్పందించాల్సి వుంది.
ఏమ, రేపో మాపో సోషల్ మీడియా వేదికగా హర్ష్ మెహతాతో తనకున్న ‘రిలేషన్’ విషయమై మలైకా అరోరా స్పందిస్తుందేమో.!
‘ఆమె జీవితం, ఆమె ఇష్టం..’ అని గతంలో అర్జున్ కపూర్ – మలైకా డేటింగ్ మీద చాలామంది బాలీవుడ్ సినీ ప్రముఖులు తమదైన రీతిలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
అన్నట్టు మలైకా అరోరా వయసు 50 పైనే.! ఇకా ఖచ్చితంగా చెప్పాలంటే, యాభై రెండేళ్ళు.! అయినాగానీ, ఫిట్ అండ్ పెర్ఫెక్ట్ మలైకా అరోరా, జస్ట్ ముప్ఫయ్యేళ్ళ బ్యూటీలానే కనిపిస్తుంది.
