Pooja Hegde Slaps Hero.. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా, తన అనుమతి లేకుండా తన కారవాన్‌లోకి అడుగు పెట్టిన ఓ హీరో చెంప పగలగొట్టిందట హీరోయిన్ పూజా హెగ్దే.!
ఇదీ ప్రచారంలో వున్న ఓ వార్త.! దీన్ని గాసిప్ అనీ, గాలి వార్త అనీ, పుకారు అనీ.. ఏదైనా అనొచ్చు.! అసలు పూజా హెగ్దే ఎక్కడ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది.? అన్న ప్రశ్నకు సమాధానమే లేదు.
సోషల్ మీడియా యుగంలో.. నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచమంతా తిరిగేస్తుంటుంది. సో, ఇప్పుడు పూజా హెగ్దే స్టేట్మెంట్.. అంటూ జరుగుతున్న ప్రచారం కూడా అంతేనేమో.!
‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్‌ని పూజా హెగ్దే ‘చెంప పగలగొట్టంది’ అంటూ అప్పుడే బోల్డన్ని కథనాలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా షురూ అయిపోయాయి.
Pooja Hegde Slaps Hero.. వివరణ ఇచ్చుకుంటూ పోవాల్సిందే..
నిజానికి, ఇలాంటి దుష్ప్రచారాల విషయమై సినీ ప్రముఖులు వీలైనంత వేగంగా స్పష్టత ఇవ్వాల్సి వుంటుంది. కానీ, వివరణ ఇచ్చుకుంటూ పోతే, రోజుకొకటి కాదు.. గంటకొకటి పుట్టుకొస్తుంటాయ్ ఇలాంటివి.
కొన్నిసార్లు మౌనంగా వుండటమే బెటర్.. అనుకుంటారు సెలబ్రిటీలు. అంటే, మౌనం అర్థాంగీకారమే కదా.. ఆ లెక్కన్న గాసిప్పులు నిజమే అయి వుంటాయనే భ్రమల్లోనూ వుంటారు నెటిజనాలు.
నిజానికి, పూజా హెగ్దే వివాదాలకు దూరంగా వుంటుంది. కో-స్టార్స్‌తో ఆమెకు సన్నిహిత సంబంధాలే వుంటాయి. అలాంటి పూజా హెగ్దే మీద ఇంత అగ్రెసివ్ గాసిప్స్ ఎందుకు పుట్టుకొస్తున్నట్లు.?
Also Read: మీనాక్షి చౌదరి పెళ్ళి పుకారు! ఈ ‘గాలి వార్త’ని వండి వడ్డించిందెవరు?
ఇదిలా వుంటే, పూజా హెగ్దే మీద జరుగుతున్నదంతా దుష్ప్రచారమేనంటూ ఆమె సన్నిహితుల నుంచి వివరణ వస్తోంది.
తన మీద పనిగట్టుకుని, కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నవారిపై చట్ట పరమైన చర్యలకు పూజా హెగ్దే సిద్ధమవుతోందిట.
