Pawan Kalyan Telangana Politics.. దేశ రాజకీయాల్లో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా రాజకీయ నాయకులు, ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు.
ఇక, ఏ రాజకీయ పార్టీ అయినా, ఎక్కడైనా పోటీ చేయడానికి ఆస్కారముంది. ఇది అందరికీ తెలిసిన విషయమే.
కానీ, తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్‌కి చోటు లేదంటూ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులు ఈ మధ్య తరచూ వ్యాఖ్యానిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో, ఈ మాట ఎక్కువగా వినిపించేది.. అదీ, సీమాంధ్ర రాజకీయ నాయకుల గురించి. అది ఉద్యమకాలం.. అది సెంటిమెంట్ల వ్యవహారం.
Pawan Kalyan Telangana Politics.. తెలంగాణ రాజకీయాల్లో జన సేన..
కానీ, అప్పుడూ.. సోకాల్డ్ తెలంగాణ వాదుల పప్పులుడకలేదు. గెలవడం ఓడటం వేరే చర్చ. పోటీ చేయకూడదు.. అంటే ఎలా.?
ప్రస్తుతం తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. జన సేన పార్టీ నుంచీ కొందరు అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
బీజేపీ – జనసేన పొత్తులో వున్నాయ్ గనుక, ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్‌ని ఆహ్వానించారు తెలంగాణ బీజేపీ నాయకులు.
సో, బీజేపీ ఆహ్వానం మేరకు తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే, అందులో తప్పుపట్టడానికేముంది.? మంత్రులు, ఇతర కాంగ్రెస్ నాయకులకు మాత్రం ‘తప్పు’ కనిపిస్తోంది.
సోకాల్డ్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమీ వుండదంటున్నారు. బీజేపీకే దుకాణం లేదు, జన సేన పార్టీకి అవకాశమెక్కడిది.? అంటూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సెటైర్లేస్తున్నారు.
సీన్ లేదా.? సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న జనసేన..
నిజంగానే జన సేన పార్టీకి అంత సీన్ లేకపోతే, తెలంగాణలో అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీకి మంచిదే కదా.! జన సేన పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం వాళ్ళకేమొచ్చింది.?
2023లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జన సేన పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసింది.. ఎక్కడా గెలవలేదు. కానీ, కూకట్‌పల్లిలో కాస్త పోటీ ఇచ్చింది.
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా వుండవు. మొన్నటికి మొన్న తెలంగాణలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కొన్ని చోట్ల జన సేన అభ్యర్థులు గెలిచారు.
Also Read: ఆకాశంలో క్రీడీ మైదానం! ఎడారి దేశంలో అద్భుతం!
మునిసిపల్ ఎన్నికల్లో కూడా తెలంగాణ నుంచి కొందరు జన సేన నాయకులు గెలవబోతున్నారు. జనసేన పార్టీ తెలంగాణలో ఎదుగుతుందనడానికి ఇదే నిదర్శనం.
బీజేపీ – జనసేన పొత్తు రోజురోజుకీ మరింత బలపడుతోంది. టీడీపీ కూడా తెలంగాణలో రంగంలోకి దిగితే.. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారతాయ్.
షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఇంకో రెండేళ్ళలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. అదీ, తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆందోళన.!
