Pawan Kalyan Dharmika Responsibility.. సనాతన ధర్మ పరిరక్షణ మనందరి బాధ్యత.. అంటూ, హిందూ సమాజానికి పిలుపునిస్తున్నారు జన సేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా.
ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థుల నుంచి పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన రీతిలో విమర్శల దాడులు చూస్తున్నాం.
ఓ హిందువుగా, సనాతన ధర్మ పరిరక్షణ గురించి తాను మాట్లాడుతోంటే, రాజకీయ విమర్శలు చేయడం తగదంటూ, రాజకీయ ప్రత్యర్థుల్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మహా ప్రసాదంలో నకిలీ నెయ్యి వినియోగానికి సంబంధించి, పవన్ కళ్యాణ్ గళం విప్పడంతో, ’కల్తీ నాయకుల‘ నుంచి ఆయన మరిన్ని దూషణల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది.
Pawan Kalyan Dharmika Responsibility.. ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు..
గత కొద్ది రోజులుగా, తెలుగునాట.. అందునా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు.. హిందూ ధర్మంపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హిందూ సమాజానికి ఓ పిలుపునిచ్చారు.
’’ప్రతీ సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం, నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చింది. మనందరిలో దేవుడిపై భయం ఉంది, ధర్మంపై గౌరవం ఉంది.‘‘ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
’’కానీ హిందూ దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు, మన బాధను మనలోనే దాచుకొని, “కర్మ చూసుకుంటుంది” అని అనుకొని మౌనంగా ముందుకు సాగుతున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు.
’’ఈ విధానం ఖచ్చితంగా మారాలి. కులం, మతం, ప్రాంతం, భాషల ద్వారా మనం విడిపోయినట్టుగా కనిపించినా, మనందరి ధర్మం ఒకటే, దేవతలు ఒక్కరే..‘‘ అని జనసేనాని చెప్పుకొచ్చారు.
’’మన ధర్మం, మన విశ్వాసం తప్పుడు ఆలోచనలతో అపహాస్యం చేయబడినప్పుడు, మన వేదనను, బాధను బహిరంగంగా వ్యక్తపరచడం మన నైతిక బాధ్యత..‘ అని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్.
సహనం బలహీనత కాకూడదు..
’’అలాంటి సందర్భాల్లో మౌనం పాటించడం మనందరి సహనాన్ని బలహీనంగా చూపిస్తుంది. మనం కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా, మన ధర్మ పరిరక్షకులుగా మారాలి..‘ అని పవన్ కళ్యాణ్ సూచించారు.
’’హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదు.కేవలం మన ధర్మాన్ని మనం రక్షించుకోవడమే‘‘ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
వైసీపీ హయాంలో, కుట్ర పూరితంగా హిందూ దేవాలయాలపై జుగుప్సాకరమైన రీతిలో దాడులు జరిగాయి. రామతీర్థంలో రాములోరి విగ్రహం తల నరికారు కొందరు దుండగులు.
Also Read: రియల్ ఎస్టేట్ ఢమాల్.! స్టూడెంట్స్ విదేశీ విద్యా వెతల్.!
అంతర్వేదిలో అయితే ఏకంగా రథాన్నే తగలబెట్టారు.. కానీ, ఆ ఘాతుకానికి పాల్పడ్డవారెవరో కనుగొనలేకపోయింది నాటి వైసీపీ ప్రభుత్వం.
అదే వైసీపీ హయాంలో, తిరుమల లడ్డూ ప్రసాదంలో నకిలీ నెయ్యిని వినియోగించినట్లుగా తేలింది. ఈ క్రమంలో యావత్ హిందూ సమాజం తీవ్ర ఆందోళనకు గురవుతోన్న సంగతి తెలిసిందే.
అయితే, సీబీఐ నేతత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం లడ్డూ కోసం వినియోగించింది నకిలీ నెయ్యేనని తేల్చినాగానీ, వైసీపీ మాత్రం అసలు కల్తీ జరగలేదంటూ బుకాయిస్తుండడం గమనార్హం.
