Pawan Kalyan Brother Lokesh.. ఇద్దరూ మంత్రులే. కాకపోతే, జన సేనాని పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి.
ఉప ముఖ్యమంత్రి అయినాసరే, మిగతా అందరు మంత్రుల్లానే పవన్ కళ్యాణ్ కూడా.. అంటారు కొందరు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి అనే పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి జన సేనాని పవన్ కళ్యాణ్.
ఎందుకంటే, గతంలో ఉప ముఖ్యమంత్రుల వ్యవహారశైలి వేరు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రదర్శిస్తున్న పని తీరు వేరు.!
సరే, ఈ పని తీరు ప్రామాణికాల గురించి ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం. ఎంత మిత్రపక్షం అయితే మాత్రం, పవన్ కళ్యాణ్‌ని టీడీపీ అంతలా పొగడాలా.?
Pawan Kalyan Brother Lokesh.. తూలనాడుతుతన్న తెలుగు తమ్ముళ్ళు..
ఈ ప్రశ్న, టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమవుతోంది. కొందరు, తమ అధినేతనీ తూలనాడుతున్నారు. నారా లోకేష్ టీమ్.. అని చెప్పుకుంటున్న నెటిజనం కూడా ఇదే బాటలో ప్రశ్నిస్తోంది.
పవనన్న.. పవనన్న.. అంటూ ఎక్కడికి వెళ్ళినా, ‘స్పేస్’ తీసుకుని మరీ, పవన్ కళ్యాణ్ భజన చేస్తున్నారు లోకేష్. ఒక్కమాటలో చెప్పాలంటే, పవన్నామ స్మరణ లేకుండా నారా లోకేష్ ప్రసంగాలు వుండటంలేదు.
ఎందుకిలా.? ఒకప్పుడు ‘దత్త పుత్రుడు’ అని పేరు పెట్టిన నారా లోకేష్, ఇప్పుడు ‘పవనన్న’ అని ఎందుకు పొగుడుతూ పొగుడుతూ వున్నారు.?
టీడీపీ శ్రేణుల్నే కాదు, జన సేన శ్రేణుల్నీ ఆశ్చర్యపరుస్తున్న విషయమిది. వైసీపీ శ్రేణులు అటు పవన్ కళ్యాణ్‌నీ ఇటు నారా లోకేష్‌నీ ఈ విషయమై ట్రోల్ చేయడం.. అది వేరే చర్చ మళ్ళీ.
భజనకీ బలమైన కారణం వుందిగానీ..
నిజానికి, బలమైన కారణం.. చాలా చాలా బలమైన కారణమే వుంది నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీద అమితమైన ‘సోదర భావాన్ని’ ప్రదర్శించడంలో.
2024 ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయ్యారు. అప్పటి వైసీపీ సర్కార్, కుట్ర పూరితంగా చంద్రబాబుని అరెస్ట్ చేసిందన్నది రాజకీయ విమర్శ.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకి కనీస వసతులు లేకుండా చేసింది అప్పటి వైసీపీ సర్కార్. వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబుకి, కనీసం బెయిల్ రాలేదు అప్పట్లో.
Also Read: ఇంకో బ్రేకప్.! అనుపమకే ఎందుకిలా జరుగుతోందబ్బా.?
ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడే, జన సేనాని పవన్ కళ్యాణ్, చంద్రబాబుకీ అలానే చంద్రబాబు కుటుంబానికీ అండగా నిలబడ్డారు.
తమ కుటుంబానికి పవన్ కళ్యాణ్ ఎంతలా అండగా నిలబడ్డారో, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పలు సందర్భాల్లో చెప్పారు.
టీడీపీ, జన సేన పొత్తు వేరు.. కష్ట కాలంలో చంద్రబాబు కుటుంబానికి పవన్ కళ్యాణ్ అండగా నిలబడ్డం వేరు. అదే, ఆ అంశమే బహుశా ‘పవనన్న’ అంటూ నారా లోకేష్ పదే పదే చెప్పడానికి కారణం కావొచ్చు.
సరే, ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నదీ కాదనలేని విషయం.! రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు వుండరన్నదీ నిజం.!
