Home » ముఖ్యమంత్రిగా జూనియర్ ఎన్టీయార్.! కానీ, ఏ రాష్ట్రానికి.?

ముఖ్యమంత్రిగా జూనియర్ ఎన్టీయార్.! కానీ, ఏ రాష్ట్రానికి.?

by hellomudra
0 comments
Jr NTR

CM Jr NTR Politics.. జూనియర్ ఎన్టీయార్.. తెలుగు తెరపై తిరుగులేని స్టార్‌డమ్‌ని సంపాదించుకున్న నటుడు.!

ఇప్పుడంతా ప్యాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది.. జూనియర్ ఎన్టీయార్ కూడా అవే తరహా సినిమాలూ చేస్తున్నాడు.

మొన్నీమధ్యనే బాలీవుడ్ సినిమా ‘వార్-2’లో హృతిక్ రోషన్‌తో కలిసి నటించాడు జూనియర్ ఎన్టీయార్. కానీ, ఆ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇంకొన్ని సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటనలు రావాల్సి వుంది.

CM Jr NTR Politics.., కర్నాటకలో జూనియర్ ఎన్టీయార్ బల ప్రదర్శన..

తాజాగా, జూనియర్ ఎన్టీయార్ బెంగళూరుకి వెళ్ళాడు. కర్నాటకలో తెలుగు సినీ హీరోలకు బోల్డంతమంది అభిమానులున్నారు. అలానే, జూనియర్ ఎన్టీయార్‌కీ అభిమానులున్నారు.

అన్నట్టు, జూనియర్ ఎన్టీయార్‌‌కి తన తల్లి వైపు నుంచి కర్నాటకతో మంచి సంబంధాలున్నాయి. తెలుగునాట జూనియర్ ఎన్టీయార్‌కి వున్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది.?

చాలాకాలం క్రితం తెలుగు దేశం పార్టీ తరఫున జూనియర్ ఎన్టీయార్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నాడు. ఆ తర్వాత, ఆ పార్టీ దరిదాపుల్లో జూనియర్ ఎన్టీయార్ కనిపించలేదనుకోండి.. అది వేరే సంగతి.

జూనియర్ ఎన్టీయార్‌కి టీడీపీలో అభిమానులకంటే, శతృవులు ఎక్కువ వున్నారన్నది ఓపెన్ సీక్రెట్. దానికి కారణాలు వేరే వున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబుకి వ్యతిరేకంగా, జూనియర్ ఎన్టీయార్ అభిమానులు బ్యానర్లు కడుతుండడమూ చూస్తుంటాం. అలానే, జూనియర్ ఎన్టీయార్‌ని దూషించే టీడీపీ నేతలూ వున్నారు.

ముఖ్యమంత్రి.. ఏ రాష్ట్రానికో.?

ఇప్పుడిదంతా ఎందుకంటే, ‘సీఎం ఎన్టీయార్’ అంటూ, జూనియర్ ఎన్టీయార్ అభిమానులు బెంగళూరులో హడావిడి చేశారు. ఓ ఆసుపత్రికి సంబంధించిన కార్యక్రమంలో జూనియర్ ఎన్టీయార్ పాల్గొన్నప్పుడు జరిగిన సంఘటన ఇది.

ఇంకా సరిగ్గా చెప్పాలంటే, జూనియర్ ఎన్టీయార్ అభిమానులు తమ అభిమాన నటుడి కోసం బల ప్రదర్శన చేశారక్కడ. అంతా విస్తుపోయారు ఆ బల ప్రదర్శన చూసి.

అయినా, కర్నాటక రాజధాని బెంగళూరులో జూనియర్ ఎన్టీయార్ అభిమానులు ‘సీఎం ఎన్టీయార్’ అని బలప్రదర్శన చేయడం దేనికి సంకేతం.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్.

ఒకవేళ జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి వస్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాన్ని ఆయన ఎంచుకుంటారు.? ఇదే ఓ మిస్టరీ క్వశ్చన్.

రాజకీయాల్లోకి వచ్చేయాలని వుందిగానీ..

అలాంటిది, కర్నాటకలో బలప్రదర్శన చేయడం ద్వారా జూనియర్ ఎన్టీయార్ కావొచ్చు, ఆయన అభిమానులు కావొచ్చు.. ఏం సంకేతాల్ని ఎవరికి పంపినట్లు.?

ప్రస్తుతానికైతే జూనియర్ ఎన్టీయార్‌కి రాజకీయాలపై ఆసక్తి లేదు. అలాగని, రాజకీయాలపై జూనియర్ ఎన్టీయార్‌కి అస్సలంటూ ఇష్టమే లేదని చెప్పడమూ సబబు కాకపోవచ్చు.

జూనియర్ ఎన్టీయార్ తండ్రి హరికృష్ణ రాజకీయాల్లో పనిచేశారు. తాత స్వర్గీయ ఎన్టీయార్, తెలుగునాట రాజకీయాల్లో సరికొత్త సంచలనం ఒకప్పుడు. బాబాయ్ బాలయ్య కూడా రాజకీయాల్లోనే వున్నారు.

సో, జూనియర్ ఎన్టీయార్ ఎప్పుడో ఒకప్పుడు రాజకీయాల్లోకి రావొచ్చు. ఇప్పుడే వచ్చేయాలని అభిమానుల కోరిక.! జూనియర్ ఎన్టీయార్ కూడా, ఆ దిశగా వేదిక సిద్ధం చేసుకుంటున్నట్లే కనిపిస్తోంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group