Jasprit Bumrah Team India.. ఒక ఓవర్‌లో ఆరు బంతులుంటే, ఆరు బంతుల్నీ యార్కర్లుగా సంధించడంలో టీమిండియా బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తర్వాతే ఎవరైనా.!
అదెలా సాధ్యం.? అని క్రికెట్ పండితులు ముక్కున వేలేసుకునేలా చేస్తుంటాడు జస్‌ప్రీత్ బుమ్రా.! బూమ్ బూమ్ బూమ్రా.. అని, ‘బుమ్రా’ గురించి ముద్దుగా చెప్పుకుంటుంటాం.
వేగంగా బంతిని వికెట్ల మీదకు సంధించడం, ఈ క్రమంలో రకరకాల విన్యాసాలు చేస్తుంటుంది బంతి. అదే బుమ్రా మాయాజాలం.!
బుమ్రా యార్కర్లకి, ఏ బ్యాటర్ దగ్గర కూడా సరైన సమాధానం వుండదంటే, అతిశయోక్తి కాదేమో.! క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్.. అని చెప్పుకుంటుంటాం.
జస్‌ప్రీత్ బుమ్రా విషయంలో కూాడా అలానే చెప్పుకోవాలి. క్రికెట్‌కి సంబంధించి ‘యార్కర్ల దేవుడు’ అని జస్‌ప్రీత్ బుమ్రా గురించి ఆల్రెడీ చెప్పేసుకుంటున్నారంతా.
Jasprit Bumrah Team India.. క్రికెట్‌లో ఏ ఫార్మాట్ అయినాసరే..
క్రికెట్‌లో ఏ ఫార్మాట్ అయినా, జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఒకేలా వుంటుంది. బుమ్రా చేతికి బంతి వచ్చిందంటే, వికెట్ ఖచ్చితంగా పడుతుందని కామెంటరీ వినిపిస్తుంటుంది.
కానీ, జస్‌ప్రీత్ బుమ్రా తర్వాత టీమిండియాకి అలాంటి బౌలర్ మళ్ళీ దొరుకుతాడా.?
టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తాజా విజయం తర్వాత, భారత క్రికెట్ అభిమానుల మెదళ్ళలో మెదులుతున్న ప్రశ్న ఇది.
పాత రక్తం పోయి, కొత్ రక్తం రావడం.. అనేది అన్ని రంగాల్లోనూ తప్పనిసరి. క్రికెట్ కూడా అంతే. సచిన్ తర్వాత ఆ స్థాయి క్రికెటర్‌ని చూడగలమా.? అనుకున్నాం.. చాలామంది వచ్చారు.
అయితే, సచిన్ స్థానం పదిలం.! టీమిండియాకి విజయాలు దక్కతున్నాయ్.! అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు పెద్దదే.
కపిల్ లాంటి ఆల్‌రౌండర్ కావాలి.. అని ఎన్నో ఏళ్ళు భారత క్రికెట్ ఎదురుచూసింది. అంతకు మించి, హార్దిక్ పాండ్యాని చూస్తున్నాం.
కుంబ్లేని రీప్లేస్ చేసే క్రికెటర్ మాత్రం రాలేదు. సచిన్ విషయంలోనూ అంతే. ద్రావిడ్, గంగూలీ.. అందరూ ఎవరికి వారే ప్రత్యేకం. ఆ లిస్టులో బుమ్రా పేరు ఖచ్చితంగా చేరుతుంది.
తనలాంటి ఓ బౌలర్‌ని బుమ్రా మాత్రమే తయారుచేయగలడేమో.! ‘నువ్వే, అలాంటి ఓ పెక్యూలియర్ బౌలర్‌ని తయారు చెయ్యాలి..’ అంటూ బుమ్రాని ట్యాగ్ చేస్తూ, సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజనం.
దటీజ్ జస్‌ప్రీత్ బుమ్రా.!
