YS Jagan Single Cinema.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే.
2029 ఎన్నికలకు ఏడాది ముందర.. వైఎస్ జగన్ ఈ పాదయాత్ర చేపడతారు. దీని కోసం, వైసీపీ అధినాయకత్వం ఇప్పటినుంచే సన్నాహాలు చేసుకుంటోంది.
అంతేనా, పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ‘సినిమా చూపిస్తాం’ అంటూ సంచలన ప్రకటన చేసేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
అసలిక్కడ, సినిమా ప్రస్తావన ఎందుకు.? సినిమాకీ, రాజకీయాలకీ సంబంధమేంటి.? సినిమాటిక్ రాజకీయాల్ని వైఎస్ జగన్ ఎందుకు చేస్తున్నారు.?
అన్నిటికీ మించి, ‘నారా చంద్రబాబునాయుడికి సినిమా చూపిస్తాం’ అంటూ వైఎస్ జగన్ చేసిన వ్మాఖ్యల వెనుక అసలు మర్మమేమిటి.?
YS Jagan Single Cinema.. సినిమా చూపించడం అనగానేమి జగన్.?
‘సినిమా చూపిస్తాం’ అనే మాట సర్వసాధారణంగానే చాలామంది వాడేస్తుంటారు. వైఎస్ జగన్‌కి రాసిచ్చిన స్క్రిప్టులోనూ అలాగే రాసి వుంటారు. ఎవరు రాశారోగానీ, ఇది ఔట్ డేటెడ్ స్క్రిప్ట్.!
వైఎస్ జగన్ హయాంలో, నారా చంద్రబాబునాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేశారంటూ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న అతి పెద్ద దెబ్బ అది.
అంతకన్నా సినిమా ఇంకేం చూపించగలరు వైఎస్ జగన్. అదీ, అధిాకారంలో లేకుండా.? అంటే, ఇక్కడ వైఎస్ జగన్, వ్యూహాత్మకంగా చంద్రబాబుని రెచ్చగొడుతున్నారన్నమాట.
చంద్రబాబు కూడా కక్ష సాధింపు రాజకీయాలు చేసి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏదో ఒక కేసులో అరెస్టు చేయించి, జైలుకు పంపించాలన్నమాట. ఇదే వైఎస్ జగన్ కోరికలా వుంది.
కక్ష సాధింపు రాజకీయాల్లేవ్..
నిజానికి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయాలనుకోవడంలేదు. కక్ష సాధింపు రాజకీయాలకీ దిగడంలేదు.
ఈ విషయం రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోంది. ‘సినిమా చూపిస్తాం’ అంటూ వైఎస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలు, వైసీపీని నిండా ముంచేసేలా వున్నాయి.
వెంటనే, స్క్రిప్టు రైటర్‌ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్చుకోకపోతే, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సింగిల్ సీటు మాత్రమే మిగిలే దుస్థితి రావొచ్చు.
2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన వైసీపీ, 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పడిపోవడానికి కారణం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంకృతాపరాధమే.
