Home » అమరావతికి చట్టబద్ధత.! జన సేనాని పవన్ కళ్యాణ్ నిబద్ధత.!

అమరావతికి చట్టబద్ధత.! జన సేనాని పవన్ కళ్యాణ్ నిబద్ధత.!

by hellomudra
0 comments
Pawan Kalyan

Pawan Kalyan Amaravati AP.. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించింది. అసలు, రాజధానికి చట్టబద్ధత ఎందుకు.? దేశంలో ఏయే రాష్ట్రాల రాజధానులకు చట్టబద్ధత వుంది.?

మిగతా విషయాలు పక్కన పెడితే, ఆంధ్ర ప్రదేశ్ అనేది నిజంగానే చాలా ప్రత్యేకమైన రాష్ట్రం. ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడ్డ రాష్ట్రం.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అతి పెద్ద సవాలు రాజధాని.! విడిపోయి, పుష్కర కాలం దాటిన తర్వాత, రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించింది.

విభజన నేపథ్యంలో, హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని అయ్యింది.. పదేళ్ళపాటు హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని కాగా, అంతకన్నా ముందే.. అమరావతిని రాజధానిగా ప్రకటించుకుంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం.

Pawan Kalyan Amaravati AP.. అమరావతిని చీకట్లోకి నెట్టేసిన వైసీపీ..

వైసీపీ అధికారంలోకి వచ్చాక, ఆ అమరావతిపై అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. రాజకీయ నిర్లక్ష్యం అమరావతికి శాపంగా మారింది.

ఎప్పుడైతే, వైసీపీ అధికారం కోల్పోయిందో.. మళ్ళీ అమరావతికి వెలుగొచ్చింది. చట్టబద్ధత రావడానికి దాదాపు రెండేళ్ళ సమయం పట్టడం గమనార్హం.

ఎలాగైతేనేం అమరావతికి ఇప్పుడు చట్టబద్ధత లభించింది. ఈ విషయంలో, జన సేనాని పవన్ కళ్యాణ్ నిబద్ధత అంతటా చర్చనీయాంశమవుతోంది.

రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతుల విషయంలో పవన్ కళ్యాణ్ అప్పట్లో.. అంటే, 2014-19 మధ్య ఎంత బాధ్యతగా వ్యవహరించారో, ఇప్పుడూ అంతే బాధ్యతగా వ్యవహరిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ నిబద్ధత..

రాష్ట్రంలో కూటమి ఏర్పాటుకు ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. ఇప్పుడీ అమరావతికి చట్టబద్ధత వ్యవహారంలోనూ తెరవెనుక అత్యంత కీలక భూమిక పోషించారు జన సేనాని.

ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం, బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్రం మీద చూపిన ప్రత్యేక శ్రద్ధ.. వెరసి, పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా బిల్లు పెట్టడానికి కారణాలయ్యాయి.

రాష్ట్ర రాజధాని అంటే, రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం.!

అమరావతి, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం. చివరగా.. అమరావతికి చట్టబద్ధత లభించిన దరిమిలా, అమరావతిలో రాజధాని కార్యకలాపాలు మరింత ఊపందుకోవాలి. నిర్మాణాల జోరు పెరగాలి.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group