Home » పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా వర్మ ‘గలీజ్’ ఆట.!

పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా వర్మ ‘గలీజ్’ ఆట.!

by hellomudra
0 comments
Pawan Kalyan Bharat United Vigilant Citizen

Pawan Kalyan Pithapuram Varma.. పిఠాపురం నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది.?

ఏపీ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే, జన సేనాని పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ ఆడుతున్న ఆట వెనుక అసలు రాజకీయమేంటి.?

2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్ ఆశించి భంగపపడ్డారు మాజీ ఎమ్మెల్యే వర్మ. అప్పటినుంచే, టీడీపీలో అంతర్గత కుమ్ములాటలకు వర్మ తెరలేపారు.

ఓ దశలో చంద్రబాబు, లోకేష్ దిష్టిబొమ్మల్ని తన అనుచరులతో తగలబెట్టించిన వర్మ, అధినాయకత్వాన్ని నానా బూతులూ తిట్టించిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.?

అందుకేనేమో, ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సి వున్నా వర్మని టీడీపీ అధినాయకత్వం పట్టించుకోవడంలేదు. ఈ క్రమంలోనే వర్మ, ఆ అక్కసుని, జన సేన అధినేత మీద చూపిస్తున్నారు.

Pawan Kalyan Pithapuram Varma.. వర్మ ఫొటో రాజకీయం.. మస్త్ గలీజ్.!

అధికారిక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో లేదనీ, వున్నా.. చిన్నగా వుందనీ.. తరచూ గొడవలు సృష్టిస్తున్నారు వర్మ.

తాజాగా, మరోమారు వర్మ తన పైత్యాన్ని ప్రదర్శించడంతో, స్థానిక జన సేన నేత, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎదురుతిరిగారు.

దాంతో, విషయం ముదిరి పాకాన పడింది. నిజానికి, వర్మ నేరుగా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసేందుకు సాహసించడంలేదు. చేస్తే, ఏమవుతుందో ఆయనకు తెలుసు.

అందుకే, తెరవెనుక వర్మ తనదైన గలీజ్ రాజకీయానికి తెరలేపుతున్నారు. వైసీపీతో తెరవెనుకాల చేతులు కలిపిన వర్మ, వైసీపీ క్యాడర్ సాయంతో, పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా నానా యాగీ చేస్తున్నారు.

వర్మ చేసే గలీజ్ రాజకీయానికి, వైసీపీ నుంచి పూర్తి మద్ధతు లభిస్తోంది. వర్మ తమ పార్టీ నాయకుడే.. అనేంతలా, వైసీపీ కూడా, వర్మకి బోల్డంత పబ్లిసిటీ ఇస్తోంది.

ఈ మొత్తం వ్యవహారాన్ని ఇటు జన సేనాని పవన్ కళ్యాణ్ అలానే, అటు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే వున్నారు.

Also Read: క్రైమ్‌ని ఘనకార్యంగా చూపే ప్రయత్నమే.!

వర్మని టీడీపీ నుంచి బయటకు పంపితే ఎలా వుంటుంది.? అన్న కోణంలో టీడీపీ అధినాయకత్వం ఆల్రెడీ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, తన కారణంగా మిత్రపక్షంలో అలజడిని జన సేనాని పవన్ కళ్యాణ్ కోరుకోవడంలేదు. పైగా, పిఠాపురంలో ఎన్నికల ప్రచార సమయంలో తనతోపాటు వర్మ కలిసి పని చేసిన విషయాన్ని పవన్ కళ్యాణ్ మర్చిపోలేదు.

అదే, ఆ సాఫ్ట్ కార్నర్ కాస్తా, జన సేన అధినేత పవన్ కళ్యాణ్‌కి వర్మ నుంచి మరిన్ని తలనొప్పులు తెచ్చిపెడుతోంది. కానీ, తెగే దాకా వర్మ లాగితే, సమాధానం కూడా చాలా గట్టిగానే వుండబోతోంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group