Home » సమ్మర్ సీజన్ వదిలేసి.. జూన్ మీద మోజెందుకు.?

సమ్మర్ సీజన్ వదిలేసి.. జూన్ మీద మోజెందుకు.?

by hellomudra
0 comments
Jr NTR Neel

Jr NTR Neel Movie.. సంక్రాంతికి విడుదలవ్వాల్సిన ‘పెద్ది’ సినిమా, మార్చికి వాయిదా పడింది. మార్చిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల నేపథ్యంలో, ఏప్రిల్‌కి వెళ్ళింది.!

ఏప్రిల్ నుంచి జూన్‌కి వెళ్ళిపోయింది ‘పెద్ది’.! జూన్‌లో ఖచ్చితంగా ‘పెద్ది’ ప్రేక్షకుల ముందుకు వస్తుందా.? అంటే, అదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ క్వశ్చన్.

పోనీ, మే నెలలో అయినా ‘పెద్ది’ సినిమాని విడుదల చేయొచ్చు కదా.. జూన్‌కి ఎందుకు వెళ్ళింది.? అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.

Jr NTR Neel Movie.. సమ్మర్ వేస్ట్.. జూన్ బెస్ట్.!

ఇక, ఇప్పుడు జూనియర్ ఎన్టీయార్ తాజా సినిమా కూడా జూన్‌కి వెళ్ళింది. అయితే, అది ఈ ఏడాది జూన్ కాదు.. వచ్చే ఏడాది జూన్.!

2027 జూన్ 11న తమ సినిమా విడుదల కానుందని జూనియర్ ఎన్టీయార్ అధికారికంగా వెల్లడించాడు. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు.

జూనియర్ ఎన్టీయార్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. దీన్ని రెండు పార్టుల్లో విడుదల చేస్తారట. 2027 డిసెంబర్‌లో రెండో పార్ట్ రిలీజ్ వుంటుందట.

అయినా, సమ్మర్ వదిలేసి జూన్ మీద ఎందుకు మోజు పెంచుకుంటున్నట్లు.? ఈ ఏడాది సమ్మర్ సీజన్‌లో పెద్ద సినిమా ఒక్కటీ లేదు.! వచ్చే ఏడాది సమ్మర్ సీజన్‌ని జూనియర్ ఎన్టీయార్ వదిలేసుకున్నాడు.

ఈ మధ్య ఏదన్నా సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడితే, రెండు మూడు నెలల వెనక్కి వెళ్ళిపోతోంది. అలాంటప్పుడు, వచ్చే ఏడాది సినిమా రిలీజ్ అయితే, డేట్ ఇప్పుడే ప్రకటించేయడం హాస్యాస్పదం.

Also Read: ఈ ‘గాలి వార్త’ని వండి వడ్డించిందెవరు?

2027 జూన్ నాటికి ఈక్వేషన్స్ ఎలా మారిపోతాయో ఏమో.! చాలా సినిమాలు ఇలానే రిలీజ్ డేట్స్‌ని ముందే ప్రకటించేసుకుంటున్నారు. కానీ, అవి అాలా వెనక్కి వెళ్ళిపోతూనే వున్నాయ్.!

సమ్మర్ సినిమాలంటే, సంక్రాంతి సినిమాలకంటే క్రేజ్ ఎక్కువ ఒకప్పుడు. కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. సమ్మర్ అంటే, సినిమా రిలీజులు భయపడుతున్నాయెందుకో.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group