Home » ముద్రాభిప్రాయమ్: తెలంగాణ ఎవరి ‘అయ్య జాగీరూ’ కాదు.!

ముద్రాభిప్రాయమ్: తెలంగాణ ఎవరి ‘అయ్య జాగీరూ’ కాదు.!

by hellomudra
0 comments
Pawan Kalyan JSP

Pawan Kalyan Telangana Jagir.. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెద్ద పెద్ద ఉద్యమాలే జరిగాయి. 2014 జూన్ 2న ఆ ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ.. ఇలా రెండు రాష్ట్రాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయిన సంగతి తెలిసిందే. కానీ, ఆ విభజన జరిగిన తీరు, ఎప్పటికీ మానని గాయంగా మారిపోయింది.

పార్లమెంటులో తలుపులు మూసేసి, అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించింది అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్. ఆ ప్రకంపనలు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్ని కుదేలు చేస్తూనే వున్నాయి.

తెలంగాణలో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి అధికార పీఠమెక్కింది. అదిప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారింది. దేశంలో చాలా రాష్ట్రాలున్నాయి, కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంతే.

నిజానికి, ఇదే జరిగింది. తెలంగాణలో కూడా భారత రాజ్యాంగమే అమల్లో వుంటుంది. సో, ఇందులో వివాదమేమీ లేదు.

కాకపోతే, తెలంగాణలో జన సేన పార్టీ ‘నవ నిర్మాణ సభ’ ప్లాన్ చేయడంతో, ‘తెలంగాణ ఎవరి అయ్య జాగీరు.?’ అన్న ప్రశ్న తెరపైకొచ్చింది.

ఈ ప్రశ్న కూడా చాలా పాతదే. కొత్త సీసాలో, పాత సారా.. అన్నట్లన్నమాట. తెలంగాణ నిజానికి, ఎవరి అయ్య జాగీరూ కాదు.! దేశంలో వున్న చాలా రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి.

ఏ భారతీయుడైనా, తెలంగాణలో స్వేచ్ఛగా జీవించొచ్చు. అంతేనా, రాజకీయ పార్టీ పెట్టొచ్చు. ప్రజల నుంచి ఆశీర్వాదం లభిస్తే, అధికార పీఠమెక్కొచ్చు.

Also Read: Janasenani Pawan Kalyan Journey: చట్ట సభలకు దారేదీ.!

అబ్బే, అలా కుదరదు.. పోరాడి తెచ్చుకున్నాం.. ఎవరికీ అధికారం ఇచ్చేది లేదు.. అని కొందరు కుహనా మేథావులు వాదించొచ్చుగాక.. అది చెల్లదు నిజానికి, చట్టం ప్రకారం.

‘పవన్ కళ్యాణ్ సభను జరగనీయం.. పవన్ కళ్యాణ్‌ని తెలంగాణలో తిరగనీయం..’ అని సోకాల్డ్ పొలిటికల్ లీడర్స్, జర్నలిస్ట్స్.. హెచ్చరించేసరికి, ‘తెలంగాణ ఎవరి అయ్య జాగీరూ కాదు’ అనే మాట పవన్ కళ్యాణ్ నుంచి వచ్చింది.

దానికి, పెద్ద రచ్చ చేస్తున్నారు పైన చెప్పుకున్న బ్యాచ్ అంతా కలిసి. అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి, తెలంగాణకి చెందిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓ గాలి వార్త పోగెయ్యడంతో మొదలైన గొడవ ఇది.

ఎవరయ్య జాగీరు తెలంగాణ.? మా అయ్య జాగీరు తెలంగాణ.! ఇలాంటి చర్చలు జరుగుతున్నప్పుడు, ఏపీ రాజకీయాల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ తల దూర్చకూడదు.

అంతెందుకు, తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చి, ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోటీ చేయడానికి కేసీయార్ ఏర్పాట్లు చేసుకున్నారు కదా.. ఆయన ముఖ్యమంత్రిగా వున్నపుడే.

సో, ఆంధ్ర ప్రదేశ్ అయినా తెలంగాణ అయినా.. ఏవీ ఎవరబ్బ జాగీరూ కాదు.! ఇది భారత దేశం. ఈ దేశం అందరిదీ.! ‘మా అయ్యల జాగీరు’ అని ఎవడన్నా అంటే, దేశ ద్రోహులవుతారు.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group