Home » ఆరు పదుల వయసులో ముచ్చటగా మూడో పెళ్ళి.!

ఆరు పదుల వయసులో ముచ్చటగా మూడో పెళ్ళి.!

by hellomudra
0 comments
Aamir Khan

Aamir Khan Third Marriage.. అయినా, పెళ్ళికి వయసుతో పనేముంది.? విడాకులకి కూడా వయసుతో పనేం లేదు.! పెళ్ళయిన రోజే, విడాకుల గురించి ఆలోచనలు చేస్తున్న రోజులివి.!

టెర్మ్స్ కుదరడం లేదు.. అందుకే విడిపోతున్నారు.! విడాకుల గురించి ఇటీవల జరుగుతున్న చర్చల తాలూకు సారాంశమిది.!

కారణమేదైతేనేం, విడాకుల లాయర్లకు భలే డిమాండ్.! విడాకులు, ఆపై మళ్ళీ పెళ్ళి, ఆ తర్వాత మళ్ళీ విడాకులు.. ఇదంతా ఓ ప్రసహనం.!

తప్పెవరిది.? అంటే, ఇరువైపులా తప్పుందంటారు కొందరు. అబ్బే, ఇద్దరిదీ తప్పు కాదంటారు ఇంకొందరు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి.

కలిసి సంతోషంగా వుండలేనప్పుడు, విడిపోయి వేర్వేరు దారులు చూసుకోవడమే బెటర్.. అన్నది, ఇప్పుడు చాలామంది చెబుతున్నమాట. అందులోనూ నిజం లేకపోలేదు.

ఔను మరి, కలహాల కాపురం కారణంగా దారుణ హత్యల్ని చూస్తున్నాం. సో, కలిసి వుండలేక ఒకర్ని ఒకరు చంపుకోవడం కంటే, విడిపోయి బతకడం బెటర్ కదా.!

సరే, ఇప్పుడిదంతా ఎందుకంటే, ఆరు పదుల వయసులో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ పెళ్ళి చేసుకోబోతున్నాడు. బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ ఈ వివాహ వేడుకకు హాజరవుతాడట.

వధువేమో, మన దక్షిణాదికి చెందిన గౌరీ స్ట్రాట్. గత కొన్నాళ్ళుగా ఆమిర్ ఖాన్ – గౌరీ స్ట్రాట్ ‘సహజీవనం’ చేస్తున్నారు. గౌరీ స్ట్రాట్‌కి గతంలో వివాహమైంది, విడాకులు తీసుకున్నారు.

అన్నట్టు, గౌరీ స్ట్రాట్‌కి ఆల్రెడీ సంతానం వుంది. ఆమిర్ ఖాన్‌ సంగతి తెలిసిందే. మొదటి పెళ్ళి రీనా దత్తాతో జరిగింది.

చాలా ఏళ్ళ వైవాహిక జీవితం తర్వాత, రీనా దత్తా విడాకులిచ్చి, మరో వివాహం చేసుకున్నాడు ఆమిర్ ఖాన్. రెండో భార్య కిరణ్ రావుతో కూడా చాలాకాలమే వైవాహిక జీవితాన్ని నడిపాడు ఆమిర్ ఖాన్.

కొన్నేళ్ళ క్రితమే కిరణ్ రావుకి విడాకులు ఇచ్చిన ఆమిర్ ఖాన్, ఆ తర్వాత గౌరీ స్ట్రాట్‌తో సహజీవనం మొదలు పెట్టాడు. ఇద్దరూ ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.

Also Read: ఓయ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్టూ.! ముల్లు గట్టిగా గుచ్చేసుకుంటాది.!

పెళ్ళి బెంగళూరులో జరగబోతోంది. ముందుగా చెప్పుకున్నట్లు సల్మాన్ ఖాన్ ఈ వివాహానికి హాజరవుతాడట. షారుక్ ఖాన్ కూడా వస్తాడట.

ఆరు పదుల వయసులో ఆమిర్ ఖాన్ మూడో పెళ్ళి చేసుకోవడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఈ పెళ్ళి ముచ్చట ఎన్నాళ్ళో.? అనే సెటైర్ల సంగతి సరే సరి.

తోడు కావాలనుకున్నాడు.. సో, ఆరు పదుల వయసులో పెళ్ళి పీటలెక్కాలనుకుంటున్నాడు.. ఇందులో ఆమిర్ ఖాన్ తప్పేముంది.? అనేది ఇంకో వాదన.

అయినా, ఆమిర్ ఖాన్ వెతికి మరీ హిందువుల్నే పెళ్ళాడుతున్నాడెందుకు.? వాళ్ళ ద్వారా కనే పిల్లలకి ముస్లిం పేర్లు మాత్రమే ఎందుకు పెడుతున్నట్లు.? అన్న ప్రశ్నని తెరపైకి తెస్తున్నారు కొందరు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group