YS Jagan Arrest Drama.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెంపుడు మీడియా నుంచి దూసుకొచ్చిన ప్రశ్న ఇది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ, 2024 ఎన్నికల్లో దారుణ పరాజయం పొందిన సంగతి తెలిసిందే. జూన్ 4న ఎన్నికల ఫలితాలొచ్చాయి.
సరిగ్గా రెండేళ్ళ తర్వాత, అదే, జూన్ 4న వైసీపీ పెంపుడు మీడియా, ‘రెండేళ్ళవుతున్నా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్టు కాలేదు’ అంటూ ఓ చిత్రమైన విశ్లేషణా కథనాన్ని వండి వార్చింది.
ఇక్కడ, వైఎస్ జగన్ అరెస్టుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అనుకూల మీడియా ఎంతలా కోరుకుంటోందో స్పష్టమవుతోంది.
మామూలుగా అయితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్టవ్వాలని ఆయన రాజకీయ ప్రత్యర్థులు కోరుకోవాలి.
YS Jagan Arrest Drama.. పెంపుడు మీడియా అత్యుత్సాహం వెనుక..
ప్రత్యర్థి పార్టీలు, పార్టీలకు చెందిన నేతలు, వైఎస్ జగన్‌ని వ్యతిరేకించే మీడియా నుంచి ఈ తరహా ప్రశ్నలు వస్తే, అదో లెక్క. కానీ, వైసీపీ పెంపుడు మీడియా, ఆయన అరెస్టుని ఎందుకు కోరుకుంటోంది.?
నిజమే, వైసీపీ అధికారం కోల్పోయాక పలువురు వైసీపీ నాయకులు వివిధ కేసుల్లో అరెస్టయ్యారు, అరెస్టవుతూనే వున్నారు. ఇదొక నిరంతర ప్రక్రియ.
వైసీపీ హయాంలోనూ పలువురు టీడీపీ నేతలు అరెస్టయ్యారు. అవన్నీ అక్రమ అరెస్టులని టీడీపీ ఆరోపించింది. ఇప్పుడు వైసీపీ నేతలు అరెస్టవుతున్నారు, వాటిని అక్రమ అరెస్టులని వైసీపీ అంటోంది.
Also Read: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాలకు వెళితే తప్పేంటి.?
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వైసీపీ హయాంలో అరెస్టయ్యారు. కానీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం చంద్రబాబు హయాంలో అరెస్టవలేదు.
ఇదే బహుశా, వైసీపీని, వైసీపీ అనుకూల మీడియాని కొంత ఇబ్బంది పెడుతున్నట్లుంది. ఎలాగైనా వైఎస్ జగన్ అరెస్టయితే బావుణ్నని కోరుకోవడమేంటో.. ఇదేమి పైత్యపు కోరికో.!
Also Read:
మొన్నామధ్యన తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ నాగేశ్వర్, జగన్ అరెస్టు విషయమై అమిత్ షా వద్ద పవన్ కళ్యాణ్ ప్రస్తావించారనీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందుకు నిరాకరించారనీ పుకార్లు పుట్టించాడు.
ఆ పుకార్ల ప్రకంపనలు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయంగా చిచ్చు పెడుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఓ పెయిడ్ ఆర్టిస్టన్న విషయం తేటతెల్లమయిపోయింది.
ఏదో జరుగుతోంది.. వైఎస్ జగన్ అరెస్టయితే తప్ప, వైసీపీకి పొలిటికల్‌గా మైలేజ్ రాదని వైసీపీ అధినాయకత్వం భావిస్తోందా.? అంతేనేమో.!
