Home » కిరణ్ అబ్బవరం స్వయంకృషి.! తనను తానే చెక్కుకుంటున్నాడు.!

కిరణ్ అబ్బవరం స్వయంకృషి.! తనను తానే చెక్కుకుంటున్నాడు.!

by hellomudra
0 comments
Kiran Abbavaram

Kiran Abbavaram Direction KA13.. సినీ పరిశ్రమలో దర్శకులుగా మారిన నటులు.. నటులుగా మారిన దర్శకులు.. చాలామందే వున్నారు.! కాకపోతే, చాలా చాలా అరుదైన వ్యవహారమిది.

నటి విజయ నిర్మల దర్శకురాలిగా మారి, తిరుగులేని రికార్డుల్ని సొంతం చేసుకున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు, నటుడిగా ఎన్నో విజయాల్ని అందుకున్నారు.

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుడు, కానీ.. నటుడిగానూ రాణించారు. హీరోలు మెగా ఫోన్ పట్టుకోవడం కొత్తేమీ కాదు, ముందే చెప్పుకున్నట్లు చాలా చాలా అరుదైన విషయం.

కొంత అనుభవం సంపాదించుకున్నాక దర్శకులుగా మారాలని నటులైనా, నటీమణులైనా అనుకోవడం వింతేమీ కాదు.

విశ్వక్ సేన్, నటుడు మాత్రమే కాదు, నిర్మాత అలానే దర్శకుడు కూడా. సిద్దూ జొన్నలగడ్డకి దర్శకత్వంపై పూర్తి అవగాహన వుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Kiran Abbavaram Direction KA13.. ఆ లిస్టులోకి కిరణ్ కూాడా..

అసలు విషయానికొస్తే, నటుడు కిరణ్ అబ్బవరం దర్శకుడిగా మారి ఓ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

కిరణ్ అబ్బవరం అంటే, సినిమా మీద ఇష్టంతో సినిమా రంగంలోకి అడుగు పెట్టిన ఓ సాధారణ యువకుడు. చిన్నా చితకా సినిమాలు చేసుకుంటూ, తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు.

మొన్నీమధ్యనే నిర్మాతగా మారిన కిరణ్ అబ్బవరం, ఈసారి కథ సిద్ధం చేసుకుని, మెగా ఫోన్ పట్టాలనే నిర్ణయానికి వచ్చాడు.

గత కొన్నేళ్ళుగా, ‘వేలు పెడుతున్నాడు..’ అనే విమర్శల్ని గట్టిగానే ఎదుర్కొన్నాడు కిరణ్ అబ్బవరం. ఈ క్రమంలో కొన్ని ఫ్లాపులూ, కొన్ని హిట్లూ చూశాడు.

ఇకపై, ‘వేలు పెట్టాడు’ అనే విమర్శలకు ఆస్కారం వుండదేమో. అన్నట్టు, వేరే దర్శకులతో కిరణ్ అబ్బవరం ఇకపైనా పని చేస్తాడా.? ఆపేస్తాడా.?

నటుడిగా సినిమాలు చేయడం మానేసి, పూర్తిగా దర్శకత్వం వైపు వెళతాడా.? ఇలా కొత్త ప్రశ్నలు కిరణ్ అబ్బవరం చుట్టూ రావడం సహజమేననుకోండి.. అది వేరే సంగతి.

దర్శకుడిగా పరిచయమవుతున్న KA13 విషయానికొస్తే, ఈ సినిమాని ఓ భిన్నమైన కాన్సెప్ట్‌తో కిరణ్ అబ్బవరం తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది.

పాత కాలం నాటి హోటల్, అందులో క్యాష్ కౌంటర్ చూపిస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ డిజైన్ చేయించుకున్నాడు కిరణ్ అబ్బవరం.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group