Artificial Intelligence Tools Jobs.. వేలల్లో కాదు, లక్షల్లో ఉద్యోగాలు పోతున్నాయ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా.!
అదే సమయంలో, వేలల్లో కాదు.. కోట్లల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కోసం.!
ఇంతకీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంటే భరోసానా.? భయమా.? రెండూనూ.! ఔను, నేణేనికి రెండు వైపులున్నట్లే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విషయంలోనూ అదే సూత్రం అప్లయ్ చేయాల్సి వుంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు పెద్దయెత్తున ఉద్యోగాల తొలగింపు చర్యల్ని చేపడుతున్నాయి. దాంతో, లక్షలాది మంది ఉద్యోగాల్ని కోల్పోతున్నారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. దాంతో, ‘ఉద్యోగుల’ అవసరం బాగా తగ్గిపోతోంది. ఇది కార్పొరేట్ సంస్థలు చెబుతున్నమాటే.!
Artificial Intelligence Tools Jobs.. కోడింగ్.. కోట్లు కొల్లగొట్టేస్తున్న టూల్స్..
కోడింగ్ విషయానికొస్తే, గంటల తరబడి కూర్చుని చేసే కోడింగ్ కాస్తా, ఏఐ టూల్స్ రాకతో సులువైపోయింది. క్షణాల్లో ‘కోడింగ్’ పనులు పూర్తయిపోతున్నాయి.
అకౌంటింగ్ సెక్షన్ కావొచ్చు, ఇంకో సెక్షన్ కావొచ్చు.. అన్ని చోట్లా ఇదే పరిస్తితి. ‘వంద మంది చేసే పని, ఒక్క ఏఐ టూల్‌తో అయిపోతోంది’ అని కార్పొరేట్ సంస్థలు ఒప్పుకుంటున్నమాట వాస్తవం.
అంతెందుకు, నిత్య జీవితంలో మనకీ ఏఐ టూల్స్ బాగానే ఉపయోగపడుతున్నాయి కదా.! పాఠాలు నేర్చుకోవాలంటే, కాలేజీకి వెళ్ళాల్సిన పనిలేదు, ఏఐ టూల్స్ వుంటే చాలు.
ఇదీ పరిస్థితి.! దాంతో, ఏఐ టూల్స్ వినియోగం పెరిగిపోయింది. మొదట్లో ఉచితంగా లభించిన టూల్స్, క్రమక్రమంగా సబ్‌స్క్రిప్షన్స్ ప్రారంభించాయి.
కొన్ని టూల్స్ తక్కువ ధరలోనే దొరుకుతోంటే, కొన్ని ప్రీమియమ్ టూల్స్ సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. మరికొన్ని ప్రీమియమ్ టూల్స్ అయితే, కార్పొరేట్ సంస్థల్ని సైతం భయపెడుతున్నాయి.
Also Read:
ఓ టూల్ కోసం ఓ కార్పొరేట్ సంస్థ కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందంటే, పరిస్థితి ఎలా మారిందో అర్తం చేసుకోవచ్చు. చేసేది లేక, మళ్ళీ ‘ఉద్యోగుల’ నియామకాలపై సంస్థలు దృష్టిపెడుతున్నాయి.
సహజంగానే, ఇది ఉద్యోగులకు కాస్త ఊరటనిచ్చే అంశం. కాకపోతే, మళ్ళీ తమ ఉద్యోగాలు పోతాయేమోనన్న భయం.. ఉద్యోగుల్లో వుంటుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాలూ లేవు.
‘భయపడాల్సిన పనేమీ లేదు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలి.. దాంతో కలిసి సహజీవనం చేయక తప్పదు’ అన్నది ఏఐ టూల్స్ సృష్టికర్తలు చెబుతున్నారు.
