Home » హీరో, హీరోయిన్.. ఓ ‘పెయిన్ ఫుల్’ బ్రేకప్ స్టోరీ.!

హీరో, హీరోయిన్.. ఓ ‘పెయిన్ ఫుల్’ బ్రేకప్ స్టోరీ.!

by hellomudra
0 comments
Anupama Parameswaran

Anupama Dhruv Love Breakup.. చాలా సినిమాల్లో చూస్తున్నాం.. పెయిన్ ఫుల్ బ్రేకప్ స్టోరీల గురించి.! అదంటే సినిమా.! నిజ జీవితంలో కూడా అలాంటివి వుంటాయా.? ఏం, ఎందుకు వుండవు.?

సినీ నటి అనుపమ పరమేశ్వరన్ ఇటీవల తన బ్రేకప్ స్టోరీ గురించి ప్రస్తావించింది. అయితే, అందులో ‘హీరో’ పేరు మాత్రం చెప్పలేదు.!

కానీ, ఆ హీరో ఎవరో కాదు, ధృవ్ విక్రమ్.. అంటూ ప్రచారం జరిగింది. ‘చెప్పుతో కొట్టి మరీ బ్రేకప్ చెప్పేసింది’ అంటూ, అనుపమ పరమేశ్వరన్ – ధృవ్‌ విక్రమ్‌ల బ్రేకప్ గురించి బోల్డన్ని గాసిప్స్ గుప్పుమన్నాయి.

ఇది నిజమేనా.? అనుపమ – ధృవ్ ప్రేమలో వున్నారా ఒకప్పుడు.? ఇప్పుడు ఆ ఇద్దరి మధ్యా బ్రేకప్ అయిపోయిందా.? అంటే, ఔననే చెప్పక తప్పదేమో.!

ఇంతకీ.. ఈ బ్రేకప్ స్టోరీలో ఎవరిది విలనిజం.?

అటు అనుపమ పరమేశ్వరన్ ఓ బ్రేకప్ కథ చెప్పింది. ఇటు ధృవ్ విక్రమ్ కూడా ఓ బ్రేకప్ కథ చెప్పేశాడు.! రెండిటినీ కలిపితే, మొత్తం వ్యవహారంపై ఓ క్లారిటీ వస్తుంది.

ప్రేమలో వున్నప్పుడు శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బంది పడ్డానంటూ అనుపమ పరమేశ్వరన్, ఓ ఇంటర్వ్యూలో ఏడ్చినంత పని చేసింది.

Anupama Parameswaran Dhruv Vikram
Anupama Parameswaran Dhruv Vikram

మరోపక్క, ధృవ్ విక్రమ్ కూడా బ్రేకప్ గురించి ఓ కథ చెప్పాడు. ఆ కష్ట కాలం నుంచి తాను కోలుకోవడానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు సాయం చేశారని అన్నాడు ధృవ్.

ఎవరెన్ని విమర్శలు తనపై చేసినా, తాను వాటిని పట్టించుకోననీ, కెరీర్ మీదనే ఫోకస్ పెట్టాననీ ధృవ్ విక్రమ్ చెప్పుకొచ్చాడు.

సోషల్ మీడియాకి తాను చాలా దూరంగా వుంటానన్న ధృవ్ విక్రమ్, సినిమా ప్రమోషన్ల కోసమే సోషల్ మీడియాని వాడతానని వివరించాడు.

ఇంతకీ, ఈ పెయిన్ ఫుల్ బ్రేకప్ స్టోరీలో తప్పెవరిది.? అందమైన ప్రేమ కథ ఎందుకిలా బ్రేకప్ కథలుగా మారిపోయింది.?

ధృవ్ విక్రమ్ కావొచ్చు, అనుపమ పరమేశ్వరన్ కావొచ్చు.. తాము ప్రేమించిన వారి పేర్లను చెప్పకుండా, ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు ఆడుతున్నట్లు.?

‘బైసన్’ సినిమాలో ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించారు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group