Home » ఎనభైలలో.. ఇదొక మాయదారి గ్లామరస్ ట్రెండ్.!

ఎనభైలలో.. ఇదొక మాయదారి గ్లామరస్ ట్రెండ్.!

by Mudra369 Editorial Desk
0 comments
Eighties Ananya Nagalla

Eighties Trend Social Media.. ఎవరో మొదలెట్టారు.. ఇంకెవరో దాన్ని ఫాలో అయ్యారు.. అంతే, ప్రపంచ వ్యాప్తంగా ఇదో కొత్త ట్రెండ్ అయి కూర్చుంది.!

ఎనభైలలో.. అంటూ సోషల్ మీడియాలో ‘కోవిడ్ కంటే’ పెద్ద రోగం వైరల్ అవుతోందిప్పుడు. ‘రోగం’ అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, అంతలా పైత్యం పెరిగిపోయింది మరి.

సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త.. అని పదే పదే హెచ్చరిస్తున్నారు పోలీసులు. కానీ, ఎవరైనా వింటే కదా.!

Tejaswi Madivada Eighties
Tejaswi Madivada Eighties

వంట గది దగ్గర్నుంచి, వాష్ రూమ్ వరకు.. వయా బెడ్ రూమ్.. అన్ని విషయాల్నీ సోషల్ మీడియా వేదికగా పంచేసుకుంటున్నారు నెటిజనం.

సబ్‌స్క్రిప్షన్ అనే ఆప్షన్ పుణ్యమా అని, వల్గర్ కంటెంట్ ఏ స్థాయికి చేరిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మార్ఫింగ్ రోగం.. విచ్చలవిడిగా తయారైంది.

Eighties Trend Social Media.. మార్ఫింగ్ రోగానికీ.. ఈ రోగానికీ తేడా ఏంటి.?

ఓ వైపు, ‘మా ఫొటోల్ని మార్ఫింగ్ చేస్తున్నారు’ అంటూ ‘కుయ్యో మొర్రో’ అని సెలబ్రిటీలు ఓ వైపు ఏడుస్తున్నారు. ఇంకో వైపు, ‘ఎనభైలలో’ అంటూ, ఏఐ జనరేటెడ్ ఇమేజెస్‌ని తమంతట తామే సోషల్ మీడియాలో వదులుతున్నారు.

‘ఎనభైలలో నేనెలా వుంటానో..’ అంటూ, ఏఐ టూల్స్‌కి తమ ఫొటోలు ఇచ్చి, ఆ ఏఐ టూల్స్ ఇచ్చే ఫొటోల్ని చూసి మురిసిపోవడం వరకూ బానే వుంది. అవే, వల్గర్‌గా డిజైన్ చేయబడితేనో.!

Eighties Trend
Eighties Trend

దేశంలో వల్గర్ కంటెంట్ మీద, సోషల్ మీడియా వేదికగా నిషేధం వుంది. అయినప్పటికీ, అడ్డదారుల్లో వల్గర్ కంటెంట్ సర్క్యులేట్ అవుతూనే వుంది.

ఏఐ టూల్స్ మీద నియంత్రణ లేకుండా పోయింది. ఏదన్నా ఫొటో సోషల్ మీడియాలో ఎట్రాక్టివ్‌గా కనపడితే చాలు, క్షణాల్లో ‘వల్గర్ వీడియో’ రూపొందించేసుకోవడానికి వీలవుతోంది.

ఏఐ టూల్స్‌తో వీడియోలు, ఫొటోలు.. వద్దే వద్దు.!

‘ఎనభైలలో’ కావొచ్చు, ఇంకో ట్రెండ్ కావొచ్చు.. ఇలాంటి ఏఐ టూల్స్ కంటెంట్‌ని ప్రోత్సహించుకుంటూ పోతే, మన ముప్పుని మనమే కొని తెచ్చుకున్నట్లు.

ట్రెండ్ అనే ప్రవాహంలో కొట్టుకుపోవడం తప్ప, ‘ఇది తప్పు’ అని ఆలోచిస్తున్నవారెందరు.? అన్నది అసలు ప్రశ్న ఇక్కడ.

Eighties Nayani Pavani
Eighties Nayani Pavani

ఔను, ట్రెండ్‌ విషయంలో అస్సలు వెనక్కి తగ్గకూడదు.! ముందు వరుసలోనే వుండాలి. ఇదొక సోషల్ రోగం అయి కూర్చుందిప్పుడు.

కొందరు సెలబ్రిటీలేమో.. ఏఐ టూల్స్ ఎందుకు వాడటం.? ఇవిగో మా ఒరిజినల్ ‘ఎనభైల ఫొటోలు’ అంటూ, ఇంట్రెస్టింగ్ ఫొటోల్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.

వీళ్ళనేమో, ‘ఔట్‌డేటెడ్’ అంటూ కొందరు నెటిజనం ట్రోల్ చేస్తుండడం గమనార్హం.

Khushi Yadav
Khushi Yadav

సోషల్ మీడియాని అయినా, ఏఐ టూల్స్‌ని అయినా పద్ధతిగా వాడినంతవరకూ ఫర్లేదు. కానీ, పద్ధతి తప్పిపోతేనే.. ప్రమాదం.!

అయినా, ఈ రోజుల్లో పద్ధతి – పడికట్టు.. అనే విషయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group