Home » బాబు మాయలో సేనాని.! జనసైనికులది అరణ్య రోదనేనా?

బాబు మాయలో సేనాని.! జనసైనికులది అరణ్య రోదనేనా?

by Mudra369 Editorial Desk
0 comments
Pawan Kalyan

Pawan Kalyan Janasena Cadre Doubts.. ఒకప్పటి పవన్ కళ్యాణ్ వేరు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వేరు.!

టీడీపీ, జన సేన మధ్య 2024 ఎన్నికల ముందర పొత్తు కుదిరింది. బీజేపీతో కూడా కలిసి, ప్రభుత్వంలో వున్నారు. ఇవన్నీ తెలిసిన విషయాలే.

జనసేనాని పవన్ కళ్యాణ్, స్థానిక ఎన్నికల విషయమై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పడిన కష్టాన్ని బాగా అర్థం చేసుకున్నారు.

సీట్ల పంపకాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎంత కష్టపడ్డారో తాజాగా వెల్లడించారు. 2024 ఎన్నికల్లోనూ ఇంతలా చంద్రబాబు కష్టపడలేదని సెలవిచచారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan Janasena Cadre Doubts.. కూటమిలో అతి పెద్ద పార్టీ టీడీపీయేగానీ..

కూటమిలో టీడీపీ అతి పెద్ద పార్టీ. అధికారంలో వున్న పార్టీలు గనుక, ఆశావహులు ఎక్కువగా వుంటారు. అంతర్గత సర్దుబాట్లు చేసుకుని, న్యాయంగా మూడు పార్టీలూ వాటాల్ని తీసుకోవాలి.

వాటాల్ని తీసుకోవడమంటే, సీట్లను పంచుకోవాలి. కానీ, న్యాయబద్ధంగా సీట్ల పంపకాలు జరగలేదు. జనసేన పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయి. బీజేపీ లాభపడింది.

జన సేన పోటీ చేస్తున్న చోట్ల కూడా, టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్థులే జనసేన నుంచి బరిలోకి దిగడం జనసైనికులకు నచ్చడంలేదు.

స్థానికంగా జన సేన నాయకులు ఈ విషయమై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవేవీ, జన సేన అధినేత పవన్ కళ్యాణ్‌కి తెలియవా.? అంటే, తెలియజెయ్యాల్సిన రీతిలో జనసేన శ్రేణులు తెలియజేస్తూనే వున్నాయి.

జనసైనికులకి జనసేనాని ఓదార్పు ఎప్పుడు.?

ఇంత జరుగుతున్నా, జనసేన శ్రేణుల్ని ఉద్దేశించి జనసేనాని పవన్ కళ్యాణ్ ‘ఓదార్పు ప్రకటన’ చేయలేదిప్పటిదాకా.!

కొన్ని చోట్ల, జనసేన శ్రేణుల మీద టీడీపీ శ్రేణులు దాడులకు దిగుతున్నా, జనసేనాని స్పందించకపోవడం జనసేన కార్యకర్తల్ని తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది.

‘చంద్రబాబుని అర్థం చేసుకున్నారు సరే.. జనసేన శ్రేణుల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారు జనసేనానీ.?’ అంటూ, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తమ అధినేతను ప్రశ్నిస్తున్నారు.

ఇదే పరిస్థితి కొనసాగితే, 2029 ఎన్నికల్లో జన సేన పార్టీ నుంచి టిక్కెట్లు ఆశించవచ్చా.? అవసరం లేదా.? అన్న అయోమయంలోకి వెళ్ళిపోతున్నారు జనసేనలో కీలక నాయకులు.!

2029 ఎన్నికల నాటికి ఏమవుతుందో..

ఇది జనసేన పార్టీని కలవరపెట్టే అంశమే.! జనసేనాని వ్యూహాత్మక రాజకీయాలు చేస్తున్నారన్నదే నిజమవ్వొచ్చుగాక.! కానీ, ఆ వ్యూహాత్మక మౌనం, చేతకానితనంగా ప్రొజెక్ట్ అవుతుండడమే ఇబ్బందికరం.

రాజకీయాల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎప్పుడెలా మారిపోతాయో ఊహించలేం.! ఇది అందరూ చెప్పే మాటే.!

అప్పటిదాకా, జనసైనికుల్ని యాక్టివ్‌గా వుంచాల్సిన బాధ్యత, వారిలో ధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత, వారికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత జనసేనాని పవన్ కళ్యాణ్‌దే.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group