Microsoft Voluntary Exit Offer.. కొత్త కొత్త పదాలు.. వాటికి కొత్త కొత్త అర్థాలు.. వెరసి, ‘తీసి వేతలకు’ సంబంధించి చిత్ర విచిత్రాలు వింటున్నాం, స్వయంగా చూస్తున్నాం.!
ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ కొలువుల్లో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామన్న విషయం ప్రత్యేకంగా చెప్పాలా.? ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో, ఈ తీసివేతల ట్రెండ్ వేగంగా పెరిగిపోతోంది.
తాాజాగా, మైక్రోసాఫ్ట్ సంస్థ ‘తీసివేతలు’ షురూ చేసింది. దీనికోసం ‘స్వచ్ఛంద నిష్క్రమణ’ అనే కొత్త టెర్మ్ ప్రచారంలోకి వచ్చింది.
వాలంటరీ రిటైర్మెంట్.. అనగా, స్వచ్ఛంద పదవీ విరమణ అన్నది.. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి తరచూ వింటుంటాం. రాజకీయాల్లోనూ ఈ మాట బాగా పాపులర్.
ఇప్పుడు, కార్పొరేట్ ఉద్యోగాలకు సంబంధించి.. అందునా, సాఫ్ట్‌వేర్ రంగంలో ఈ ‘స్వచ్ఛంద విరమణ’ అనేది ట్రెండింగ్ అంశంగా మారబోతోంది.
Microsoft Voluntary Exit Offer.. ప్యాకేజీ బానే వుందిగానీ..
దాదాపు ఏడాదిపాటు, ఉద్యోగాలకు వుండే వెసులుబాట్లన్నీ ప్యాకేజీ రూపంలో కల్పిస్తూ, ఉద్యోగుల్ని వదలించుకోవడానికి ప్రముఖ కార్పొరేట్ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి.
మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 60 వేల మంది ఉద్యోగులపై ఈ అస్త్రాన్ని ప్రయోగించడం గమనార్హం. ఏడాది కాలంలో, స్వచ్ఛంద విరమణ పొందేవారికి పలు ప్రయోజనాలు లభిస్తాయి.
ఉద్యోగంలోంచి తీసేశారు.. అన్న ఆవేదన ఉద్యోగులకు వుండదు ఈ ‘స్వచ్ఛంద నిష్క్రమణ’తో. వాళ్ళ రెజ్యూమ్‌లో గౌరవ ప్రదమైన నిష్క్రమణని యాడ్ చేసుకోవచ్చన్నమాట.
నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడం, ఆర్జన తగ్గిపోవడంతో.. కార్పొరేట్ సంస్థలు, ‘భారాన్ని తగ్గించుకోవడానికి’ ఈ పద్ధతిని అవలంబిస్తున్నాయన్నది నిపుణుల అభిప్రాయం.
సీనియార్టీ పెరిగితే ఖేల్ ఖతమ్..
అయితే, ఈ నిష్క్రమణ.. నిపుణులైన ఉద్యోగులకు కొలువుల్ని దూరం చేస్తోందనీ, కొత్తవారికి తక్కువ వేతనాలకే అవకాశాలు కల్పించడం ద్వారా, కంపెనీలు ఆర్థిక భారం తగ్గించుకుంటున్నాయని భావించొచ్చు.
ఈ లెక్కన, సీనియార్టీ వస్తే ఉద్యోగం పోయినట్లేనన్న సంకేతాల్ని కార్పొరేట్ కంపెనీలు ఇస్తున్నట్లవుతోందన్నది కొందరి అభిప్రాయం.
ఒక్కటి మాత్రం నిజం.. ముందు ముందు పరిస్థితులు మరింత భయానకంగా మారబోతున్నాయి. ఈ విషయంలో ఇంకో మాటకు తావు లేదు.! మరెలా.? అంటే, అదంతే.!