Allu Sirish DJ Sounding.. అది హనుమాన్ దేవాలయం.. అక్కడి నుంచి విపరీతమైన శబ్దం వస్తోందిట. దాంతో, పోలీసులకు ఫిర్యాదు చేశాడు సినీ నటుడు అల్లు శిరీష్.!
వినాయక చవితి సంబరాల నేపథ్యంలో, భక్తులు ఉత్సాహంగా ఆడిపాడుతున్నారు. దాదాపుగా నిమజ్జనాలు పూర్తయిపోయాయి. అయినా, అక్కడక్కడా ఇంకా విగ్రహాలు నిమజ్జనం కావాల్సి వుంది.
ప్రతి రోజూ వినాయక మండపాల వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పిల్లలు, పెద్దలు.. ఆడి పాడటం మామూలే.!
గత కొంతకాలంగా, వినాయక మండపాల దగ్గర డీజే శబ్దాల హోరు పెరిగిన మాట వాస్తవం. ఆ డీజేలపై నిషేధం వుందంటూ, పోలీసులు కన్నెర్రజేస్తున్నమాట కూడా వాస్తవం.
ప్యాడ్ బ్యాండ్ అనీ, ఇంకోటనీ.. ‘సౌండింగ్’ ఓ రేంజ్‌లో వుంటోంది. యువత ఉత్సాహమే కాదు.. పిల్లలు, వృద్ధులు కూడా ఆడిపాడుతున్నారు డీజే హోరులో.
Allu Sirish DJ Sounding.. శబ్దమేనా.? హిందువు అయి వుండీ.. ఎందుకిలా.?
ఇక, అల్లు శిరీష్ నివాసం వుండేది, అత్యంత ఖరీదైన ప్రాంతంలో.. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. ఆ ప్రాంతంలో, కాస్త దూరంగా వున్న హనుమాన్ దేవాలయం నుంచి మితిమీరిన శబ్దాలు వస్తున్నాయట.
అర్థరాత్రి రెండు గంటల సమయంలో కూడా శబ్దాల హోరు తగ్గడం లేదంటూ సంబంధిత వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు.
పోలీసులూ, అల్లు శిరీష్ ట్వీటుపై స్పందించారు. అయితే, ఇక్కడే అసలు కథ మొదలైంది. హనుమాన్ టెంపుల్ దగ్గర హడావిడిపై అల్లు శిరీష్ పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని, హిందూ భక్తులు తప్పుపడుతున్నారు.
కన్వర్టెడ్ శిరీష్.? నెటిజనం ఏకిపారేస్తున్న వైనం..
‘నువ్వెప్పుడు హిందూ మతం నుంచి వేరే మతంలోకి కన్వర్ట్ అయిపోయావ్.?’ అంటూ నిలదీస్తున్నారు నెటిజనం.
దాంతో, ‘నేనూ హనుమాన్ భక్తుడినే.. ఇది మతానికి సంబంధించిన విషయం కాదు.. శబ్దానికి సంబందించిన విషయం’ అని అల్లు శిరీష్ వివరణ ఇచ్చుకున్నాడు.
తాను హిందువునేనని నిరూపించుకోవడానికన్నట్లు, కొన్ని ఫొటోలూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు అల్లు శిరీష్.
నిజమే, డీజే శబ్దాలు ఇబ్బందికరంగానే వున్నాయి. కానీ, అన్ని మతాల పండగలు అలానే ఉత్సవాల సమయంలో డీజే వినియోగం సర్వసాధారణంగా మారిపోయింది కదా.
వేరే మతాలకు సంబంధించిన ఉత్సవాలు, వేడుకల సమయంలో డీజే వాడితే, వాటి మీద అభ్యంతరాలు ఎందుకు రావడంలేదు.? అన్నదే అసలు ప్రశ్న ఇక్కడ.
పైగా, అల్లు శిరీష్ సినిమా మనిషి. సినిమా ప్రమోషన్ల కోసం కూడా డీజే హోరు వినియోగిస్తున్నారు కదా.? అంటూ నెటిజనం అల్లు శిరీష్‌ని ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా వుంటే, అల్లు శిరీష్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు, ఆ శబ్దం గణేష్ నిమజ్జనానికి సంబంధించినది మాత్రమేననీ, హనుమాన్ దేవాలయానికి సంబంధించినది కాదని తేల్చారు.
