Home » ‘చిరు’ జోరు.! సినిమాలూ, థియేటర్లూ.. ఓటీటీ.! వాట్ నెక్స్‌ట్.?

‘చిరు’ జోరు.! సినిమాలూ, థియేటర్లూ.. ఓటీటీ.! వాట్ నెక్స్‌ట్.?

by Mudra369 Editorial Desk
0 comments
Megastar Chiranjeevi

Chiranjeevi OTT Talk Show.. మెగాస్టార్ చిరంజీవి, నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓ టాక్ షో చేయబోతున్నారట.! ఔను, చిరంజీవి పేరు మీద కొత్తగా థియేటర్లు నిర్మితమవుతున్నాయట.!

ప్రపంచంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్ చిరంజీవి పేరు మీదనే హైద్రాబాద్‌లో రాబోతోందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇంకోపక్క, ఇప్పటికే వున్న ఓ థియేటర్ కాంప్లెక్స్, చిరంజీవి పేరుతో రెనోవేట్ అవబోతోందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతలోనే, ఈ ఓటీటీ టాక్ షో ప్రచారంలోకి వచ్చింది.

చిరంజీవి నుంచి ‘కాకా’, ‘విశ్వంభర’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోపక్క, ఇంకో రెండు మూడు సినిమాలు పట్టాలెక్కాల్సి వుంది.

ఏడు పదుల వయసులో మెగాస్టార్ చిరంజీవి జోరు మామూలుగా లేదు. నిజానికి, ఈ వయసులో ఇంత కష్టపడటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దటీజ్ మెగాస్టార్ చిరంజీవి.

ఓ వైపు సినిమాలు చేస్తూనే, ఇంకో వైపు థియేటర్ల బిజినెస్‌లోకి అడుగు పెడుతుండడం, ఓటీటీ టాక్ షో కోసం సిద్ధమవుతుండడమంటే ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు.

టాక్ షో అంటే, నందమూరి బాలకృష్ణ ఆల్రెడీ ‘అన్‌స్టాపబుల్’ అంటూ ‘ఆహా’లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కూడా గతంలో ఓ గేమ్ షో కోసం హోస్ట్‌గా వ్యవహరించారు.

ఇంకో వైపు, చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా.. తనను ఆహ్వానిస్తే, ఆయా ఈవెంట్లకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

రాజకీయాలకు ఆయన దూరంగా వున్నా, ఆయన్ని రాజకీయాలు దూరం పెట్టడంలేదు. రాజకీయ వార్తల్లో తరచూ చిరంజీవి పేరు ఏదో ఒక రకంగా వినిపిస్తూనే వుంది.

త్వరలో, రాజకీయ తెరపై చిరంజీవి కొత్త ఇన్నింగ్స్.. అంటూ ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నిటిని చిరంజీవి ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు.? అదే మెగా మ్యాజిక్.

ఒక్కటి మాత్రం నిజం.! కష్టే ఫలి.. అన్న విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి బలంగా నమ్ముతారు. ఆ కష్టపడే తత్వమే కొణిదెల శివ శంకర వరప్రసాద్‌ని మెగాస్టార్ చిరంజీవిగా మార్చింది.

సినిమాలపై చిరంజీవికి వున్న అవగాహన.. సినీ ప్రముఖులతో చిరంజీవికి వున్న సత్సంబంధాలు.. చిరంజీవిని అభిమానించే సినీ రంగంలోని సెలబ్రిటీలు.. ఇవన్నీ ‘టాక్ షో’కి అదనపు ఆకర్షణ అవుతాయి.

మరీ ముఖ్యంగా, చిరంజీవి స్పాంటేనిటీ.. అందునా కామెడీ టైమింగ్.. కొన్ని లీకులు.. ‘ఓటీటీ టాక్ షో’ని వేరే స్థాయిలో నిలబెడతాయనడం నిస్సందేహం.

ఓటీటీ వేదికగా చిరంజీవి ‘టాక్ షో’ ద్వారా సందడి చేయనుండడం నిజమే అయితే, అందులో పవన్ కళ్యాణ్‌తో చిరంజీవి టాక్ షో.. ఖచ్చితంగా వుండి తీరుతుంది.

జస్ట్ వెయిట్ అండ్ వాచ్.. ఈ ప్రచారాల్లో నిజమెంతో.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group