Taapsee Pannu Movie Chance.. నటి తాప్సీ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కుతుంటుంది. కాంట్రవర్సీ అంటే ఆమెకి భలే ఇష్టం.!
కాంట్రవర్సీతో ఫ్రీ పబ్లిసిటీ వస్తుందనేది తాప్సీ పన్ను బలమైన నమ్మకం కూడా.!
తాజాగా, తాప్సీ తాను ఓ సినిమా ఛాన్స్ కోల్పోవడానికి కారణమిదీ.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.! ఇప్పాడమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఫలానా హీరో పడాల్సిన సూపర్ హిట్ సినిమా, ఇంకో హీరో చేతికి వెళ్ళడం.. ఓ హీరోయిన్‌కి దక్కిన ఛాన్స్, ఇంకో హీరోయిన్ ఎగరేసుకుపోవడం.. ఇవన్నీ సినీ పరిశ్రమలో సర్వసాధారణం.
సినిమా అంటే, కళాత్మక వ్యాపారం.! బిజినెస్ ఈక్వేషన్స్‌ని బట్టి కాంబినేషన్స్ మారిపోతాయి. హిట్టొస్తే, ఛాన్సులొస్తాయి. ఫ్లాపులొస్తే, వచ్చిన ఛాన్సులు కూడా అటకెక్కేస్తాయ్.
Taapsee Pannu Movie Chance.. సినిమా ఛాన్సులంటే అంతే మరి.!
ఏ సినీ పరిశ్రమలో అయినా ఇది సర్వసాధారణం. టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా.. ఎక్కడైనా ఇదే ఈక్వేషన్ పనిచేస్తుంది.
అసలు విషయంలోకి వస్తే, ఓ సినిమా ఛాన్స్ తనకు ఆ సినిమా హీరో భార్య వల్ల దక్కకుండా పోయిందని తాప్సీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సెలవిచ్చింది.
ఇంతకీ ఎవరా హీరో.? ప్చ్, చెప్పలేదు. సినిమా గురించీ చెప్పలేదు. తెలుగు సినిమానా.? తమిళ సినిమానా.? హిందీ సినిమానా.? ప్చ్, అది కూడా చెప్పలేదు తాప్సీ.
తనను తాను చాలా ధైర్యవంతురాలిగా చెప్పుకునే తాప్సీ, నిజంగా అంత ధైర్యం కలదైతే, సదరు హీరో పేరు చెప్పెయ్యాలి. కానీ, చెప్పేందుకు ఆమె ఇష్టపడలేదు.
మొన్నీమధ్యనే తాప్సీ ఓ సినిమాలో నటించింది. ఆ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లోనే ఇదిగో, ఇలా తాను గతంలో కోల్పోయిన సినిమా ఛాన్స్ గురించి ‘ఓ రాయి’ విసిరిందంతే.
తెలుగులోనూ తాప్సీ పలు సినిమల్లో నటించింది. వేరే హీరోయిన్లు చేయాల్సిన సినిమాలూ, తాప్సీ ఖాతాలో పడ్డాయి. అలానే, తాప్సీ చేయాల్సిన సినిమాలూ వేరే హీరోయిన్లకు వెళ్ళాయి.
సినీ పరిశ్రమలో చాలా ఏళ్లుగా వున్న తాప్సీకి ఇవన్నీ తెలియని విషయాలా.? అయినా, హీరో చేసే సినిమాల విషయంలో ఆ హీరో భార్య జోక్యం చేసుకోవడం చాలా చాలా అరుదు.
అప్పుడెప్పుడో సన్నీలియోన్‌తో సినిమా చేస్తానంటే ఒప్పుకోనంటూ ఓ బాలీవుడ్ నటుడి భార్య తన భర్తకి తెగేసి చెప్పిందన్న ‘ప్రచారం’ అప్పట్లో హాట్ టాపిక్.
సన్నీలియోన్ స్థాయికి తాప్సీ తనను తాను దిగజార్చేసుకుందా.? అన్న చర్చ జరుగుతోందిప్పుడు.!
