Faria Abdullah Religious Debate.. ఫరియా అబ్దుల్లా తెలుసు కదా.? అలా ఎలా మర్చిపోతాం.? ‘జాతిరత్నం’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్డమ్ సంపాదించేసుకుంది కదా.! ఆ ‘చిట్టి’నే ఈ ఫరియా అబ్దుల్లా.!
మొన్నమాధ్యన భాగ్యనగరం బోనాల సందర్భంగా ఫరియా అబ్దుల్లా ‘తీన్మార్’ డాన్స్ చేస్తే, అది కాస్తా వైరల్ అయ్యింది.. కొందరు ఆమెని ట్రోల్ చేయడంతో, కంట తడి పెట్టింది కూడా.!
ముస్లిం కదా.. నువ్వెలా హిందువుల బోనాల్లో డాన్సులేస్తావ్.? అని నిలదీశారు కొందరు నెటిజన్లు. దాంతో, కంటతడి పెడుతూ, ఏదో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది.
అది కాస్తా కొత్త వివాదానికి తెరలేపింది. తన కుటుంబ నేపథ్యం గురించి, అందునా.. తన తండ్రి గురించి ఫరియా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి.
Faria Abdullah Religious Debate.. తొలుత హిందువు.. ఆపై బాప్టిజం..
విషయమేంటంటే ఫరియా అబ్దుల్లా తండ్రి తొలుత హిందువు అట.! ఆ తర్వాత ఆయన బాప్టిజం తీసుకున్నారట. అంటే, క్రైస్తవంలోకి మారారన్నమాట.
క్రైస్తవం నుంచి ఫరియా అబ్దుల్లా తండ్రి, మళ్ళీ ఇస్లాం వైపుకు మళ్ళాడట. అద్గదీ అసలు సంగతి. ఫరియా అబ్దుల్లా తల్లి ముస్లిం కావడం గమనార్హమిక్కడ.

అయితే, ఇక్కడ ఇంకో ట్విస్ట్ వుంది. ముస్లిం అయినప్పటికీ, తన తల్లికి హిందూ సంప్రదాయాలంటే ఇష్టమట.! అలా, తన ఇంట్లో అన్ని మతాలకు సంబంధించిన ‘దైవ చింతన’ వుంటుందని ఫరియా అంటోంది.
ఇందులో తప్పేముంది.? పలువురు సెలబ్రిటీలు క్రైస్తవంలోకి మారారు. కొందరు, ఇస్లాం సంప్రదాయంలో పుట్టి పెరిగారు. ఇతర మతాలకు చెందినవారైనప్పటికీ, హిందూ సంప్రదాయాల్న గౌరవిస్తారు చాలామంది.
బాప్టిజం నుంచి ఇస్లాం వైపు..
ప్రత్యేకించి, తన తండ్రి హిందువు అనీ, ఆ తర్వాత క్రిస్టియన్‌గా కన్వర్ట్ అయ్యారనీ, మళ్ళీ ఇస్లాం పట్ల ఆకర్షితురాలయ్యారనీ.. ఇంత వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఫరియా అబ్దుల్లాకి ఏమొచ్చిందో ఏమో.
ప్రతిసారీ ఇంటర్వ్యూల సందర్భంగా ఫరియా అబ్దుల్లాకి, ఈ మతానికి సంబంధించిన ప్రశ్న ఎదురవుతోంది. దానికి సమాధానమిచ్చుకోలేక కిందా మీదా పడుతోంది.

ఎవరి మతాన్ని వారు విశ్వసించొచ్చు. వేరే మతాల్ని అనుసరించే అవకాశమూ రాజ్యాంగం కల్పిస్తోంది. రిజర్వేషన్ల వ్యవహారం.. అది మళ్ళీ వేరే చర్చ.
బలవంతపు మత మార్పిడు అంశంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇలా మతానికి సంబంధించిన అంశంపై డిబేట్‌కి నటి ఫరియా అబ్దుల్లా ఆస్కారం ఇవ్వకపోవడమే మంచిది.
‘నో కామెంట్’ అనేయొచ్చు.. అసలు ఆ ప్రశ్నే వెయ్యొద్దని కూడా కోరవచ్చు.!
‘జాతిరత్నం’ సినిమాలోని ‘చిట్టి’ పాత్రకి ఎంత కన్ఫ్యూజన్ వుందో, రియల్ లైఫ్‌లోనూ ఫరియా అబ్దుల్లా అదే కన్ఫ్యూజన్ని మెయిన్‌టెయిన్ చేస్తే ఎలా.?
